కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Roja: భర్త సెల్వమణి మీద నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్

ABN, First Publish Date - 2023-08-29T12:53:59+05:30

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రోజాకి షాక్ తగిలింది. ఆమె భర్త సెల్వమణి మీద చెన్నైలోని ఒక కోర్ట్ నాన్ బెయిలబుల్ ఆరెస్ట్ వారంట్ ఇష్యూ చేసింది. ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా అనే అతను సెల్వమణి మీద పరువు నష్టం కేసు వేశారు, అందులో భాగంగా...

RK Roja

ఆంధ్ర ప్రదేశ్ (AndhraPradesh) మినిస్టర్ రోజా సెల్వమణి (MinisterRoja) భర్త, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి (RKSelvamani) మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. (Non-bailable arrest warrant issued on RK Selvamani) సెల్వమణి అంటే తమిళ సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు, ఎన్నో విజయం సాధించిన సినిమాలకు దర్శకత్వం చేసాడు అతను. చెన్నైలోని జార్జ్‌టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతకీ సెల్వమణి ఏమి చేసాడు, ఎందుకు కోర్టు అతనికి ఈ ఉత్తర్వులు ఇచ్చిందో తెలుసుకుందాం.

సెల్వమణి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు, అయితే ఇప్పుడు అతను అంతగా సినిమాలు చెయ్యడం లేదు, పరిశ్రమకి దూరంగా వున్నాడు. ఇంతకీ అతనికి చెన్నై కోర్ట్ ఎందుకు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసింది అంటే, సెల్వమణి 2016 లో ఒక తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో సినిమా ఫైనాన్షియర్‌ ముకుంద్‌ చంద్ బోత్రా ని (MukundChandBotra) కించపరిచే విధంగా మాట్లాడినట్టుగా అందుకు ఆ ఫైనాన్షియర్ కోర్టులో పరువునష్టం దావా వేసాడు. ఆ ఫైనాన్షియర్ ముకుంద్ కారణంగా తాను ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని సెల్వమణి ఆ ఇంటర్వ్యూ లో చెప్పినట్టుగా ఆరోపణ, అందుకని ఆ ఫైనాన్షియర్ కోర్టుకి వెళ్లాడని తెలిసింది.

ఆసక్తికరమైన అంశం ఏంటంటే కోర్టులో కేసు వేసిన ఫైనాన్సర్ ముకుంద్ బాత్రా మరణించగా, అతని కుమారుడు గగన్ బోత్రా (GangaBotra) ఆ కేసును కొనసాగించారు. ఈ కేసు సోమవారం చెన్నై కోర్టులోకి విచారణకి వచ్చినట్టుగా, దానికి సెల్వమణి హాజరు కావాల్సి వుంది, కానీ అతను హాజరు కాకపోవటంతో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ఇష్యూ చేసినట్టుగా తెలిసింది. అతని లాయర్లు కూడా కోర్టుకి వచ్చి సమాధానం చెప్పని కారణంగా, చెన్నై లోని జార్జిటౌన్ కోర్టు సీరియస్‌ గా తీసుకొని ఈ అరెస్టు వారెంట్ జారీ చేసిందని తెలిసింది.

ఇంతవరకు ఈ అరెస్టు విషయమై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి, సెల్వమణి భార్య రోజా దీని మీద స్పందించలేదు, అలాగే ఆమె భర్త సెల్వమణి ఈ అరెస్టు వారెంట్ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated Date - 2023-08-29T12:53:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!