సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rakul Preet Singh: ఆదివారం మాత్రం నన్నెవరూ ఆపలేరు

ABN, First Publish Date - 2023-04-02T11:15:07+05:30

ఇష్టమైన ఆహార పదార్థాలు కంటి ముందు ఉన్నా... తమని తాము కంట్రోల్‌ చేసుకొంటారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh) కూడా కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా

Heroine Rakul Preet Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథానాయికలకు ఫిట్‌నెస్‌, డైటింగ్‌పై శ్రద్ధ ఎక్కువ. కాస్త బొద్దుగా మారినా... అవకాశాలు రావన్న భయం వాళ్లది. అందుకే.. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇష్టమైన ఆహార పదార్థాలు కంటి ముందు ఉన్నా... తమని తాము కంట్రోల్‌ చేసుకొంటారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh) కూడా కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. పైగా తనకు ఫిట్‌నెస్‌పై గురి ఎక్కువ. తనకంటూ ప్రత్యేకమైన డైట్‌ సిస్టమ్‌ ఫాలో అవుతుంది. కాకపోతే... ఆదివారం వస్తే మాత్రం ఈ పరిధులూ, పరిమితులకు చెక్‌ పెట్టేస్తుందట. అదేంటో ఆమె మాటల్లోనే..

‘‘ఆదివారం నా చీటింగ్‌ డే (Cheating Day). వారంలో ఒక్కరోజైనా మనకు ఇష్టమైనవి తినకపోతే ఎలా..? అందుకే ఆదివారం (Sunday) మాత్రం ఎలాంటి పరిమితులూ పెట్టుకోను. నాకిష్టమైన వంటకాలన్నీ లాగించేస్తా. హైదరాబాద్‌ ఫుడ్‌ (Hyderabad Food) అంటే నాకు చాలా ఇష్టం. నగరంలో ఎక్కడెక్కడ మంచి రెస్టారెంట్లు ఉన్నాయో, అక్కడ దొరికే బెస్ట్‌ డిష్‌ ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకే స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకొంటా. కానీ.. మరుసటి రోజు మామూలే. ఎంతతిన్నా.. నేను బొద్దుగా మారను. ఆ ధీమా ఉన్నా సరే.. నా కసరత్తులు మాత్రం మానను. ప్రతీ రోజూ జిమ్‌లో గంటసేపైనా గడపకపోతే.. ఆ రోజు పూర్తవ్వదు’’ అని రకుల్ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రకుల్ ప్రీత్‌ బాలీవుడ్‌ (Bollywood)లో ఒక చిత్రం, కోలీవుడ్ (Kollywood) రెండు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది. అలాగే మరో వైపు పెళ్లి (Marriage) ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే అతనితో పెళ్లి పీటలు ఎక్కేందుకు రకుల్ సిద్ధమవుతోంది.

ఇంతకు ముందు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా (Star Heroine) ఓ వెలుగు వెలిగిన ఆమెకు.. ఆ స్థాయిలో అయితే ఇప్పుడు అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. అందుకే.. వచ్చిన అవకాశాలను వదలకుండా చేస్తూ.. మరోవైపు తన బిజినెస్‌ను చూసుకుంటోంది. ఎలాగూ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో.. ప్రియుడిని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలనేది రకుల్ ఆలోచనగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Costumes Krishna: దిల్ రాజుకు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

*Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!

*Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

*Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు

*Natural Star Nani: ‘దసరా’పై సూపర్ స్టార్ ట్వీట్.. నాని అలా అనేశాడేంటి?

*Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

Updated Date - 2023-04-02T11:19:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!