Srisai Kumar: కష్టాలని కూర్చోకుండా... కెమెరాతో చెలిమి చేసి.. ఈ రోజు సినిమాటోగ్రాఫర్‌గా..!
ABN, Publish Date - Dec 29 , 2023 | 08:37 PM
సరిగ్గా ఏడేళ్ల క్రితం, 2016లో పొట్ట చేతబట్టుకుని భాగ్యనగరానికి చేరుకున్న శ్రీసాయికుమార్ దారా.. కెమెరా విభాగంలో చేరడం ఎలా అనేది తెలియక.. షార్ట్ ఫిల్మ్స్‌కు పని చేస్తూ ఫోకస్ పుల్లర్ నాగేశ్వరరావు దేవరకొండ దృష్టిలో పడడం అతని జాతకాన్ని మార్చేసింది. కష్టాలను కేర్ చేయక.. కెమెరాతో చెలిమి చేసి.. ఈ రోజు సినిమాటోగ్రాఫర్‌గా అంచెలంచెలుగా తన సామ్రాజ్యాన్ని స్థాపించే పనిలో ఉన్నాడీ విజయనగరం చిన్నోడు.
ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను.. అతను ప్రేమించే ప్రకృతి సానుకూలం చేసింది. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమైన ఆ కుర్రాడు.. తనకు లభించని ప్రేమ, ఆప్యాయతలను ప్రకృతి నుంచి పొందే ప్రయత్నం చేస్తూ సేద దీరేవాడు. ప్రకృతి ఆవిష్కరించే అందాలను కెమెరాలో బంధించి మురిసిపోతుండేవాడు. అదే అతన్ని సినిమాటోగ్రఫీ వైపు దృష్టి సారించేలా చేసింది. కష్టాలను కేర్ చేయక.. కెమెరాతో చెలిమి చేసి.. ఈ రోజు సినిమాటోగ్రాఫర్‌గా అంచెలంచెలుగా పైకి లేస్తోన్న కెరటం శ్రీసాయి కుమార్ దారా (Srisai Kumar Dara).
సరిగ్గా ఏడేళ్ల క్రితం, 2016లో పొట్ట చేతబట్టుకుని భాగ్యనగరానికి చేరుకున్న సాయికుమార్ (Sai Kumar).. కెమెరా విభాగంలో చేరడం ఎలా అనేది తెలియక.. షార్ట్ ఫిల్మ్స్‌కు పని చేస్తూ ఫోకస్ పుల్లర్ నాగేశ్వరరావు దేవరకొండ దృష్టిలో పడడం అతని జాతకాన్ని మార్చేసింది. నాగేశ్వరరావు దేవరకొండ అండతో ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ యువరాజ్ దగ్గర కెమెరా అసిస్టెంట్‌గా చేరిన సాయి.. ఆ తర్వాత యువరాజ్ గురువు దేవరాజ్ దగ్గర ‘ఈడు గోల్డెహె’ చిత్రానికి పని చేశాడు. ఆ తర్వాత రత్నవేలు దగ్గర ‘రంగస్థలం, సైరా’ చిత్రాలకు పని చేసే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకున్నాడు. అయినా... ఇంకా ఏదో నేర్చుకోవాలన్న అతని దాహం తీరలేదు. తను కెరీర్‌గా ఎంపిక చేసుకున్న విభాగంలో మరింత ప్రావీణ్యం సాధించాలన్న కాంక్షతో సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ నెలకొల్పిన ‘మైండ్ స్క్రీన్’ అనే సినిమాటోగ్రఫీ ఇనిస్టిట్యూట్‌లో చేరి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. దాన్ని బట్టి ఈ రంగంపై సాయి కుమార్‌కు గల ప్యాషన్‌ను అర్ధం చేసుకోవచ్చు.
అప్పటికి సంపాదించినదానికి తోడు కొంత అప్పు కూడా చేసి... సినిమాటోగ్రఫీలో మంచి నైపుణ్యం సంపాదించిన సాయికుమార్‌ను కరోనా కష్టాలు చుట్టుముట్టాయి. అయితే.. కష్టాలతో ఇష్టంగా చెలిమి చేయడం చిన్నప్పటి నుంచి సాయికి వెన్నతో పెట్టిన విద్య కావడంతో.. కష్టాల గ్రహణాలు దాటుకుని, ‘శశివదనే’ చిత్రానికి ఛాయాగ్రహణం అందించే అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఆ సినిమా సెట్స్‌పై ఉండగనే.. సాయి కుమార్ టాలెంట్ బయటకు పొక్కి... మరో సినిమా ఛాన్స్ వచ్చింది. సాయి సినిమాటోగ్రఫీ అందించిన ‘ది ట్రయిల్’ అనే ఆ చిత్రం ఇటీవల విడుదలై అతని పేరు చాలా మంది దృష్టిని ఆకర్షించేలా చేసింది.
ప్రస్తుతం అవికా గోర్ -నందు నటిస్తోన్న ‘అగ్లీ స్టోరీ’ (Ugly Story)కి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయి... సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో శత్రు - సప్తగిరి నటించనున్న ఇంకా పేరు పెట్టని చిత్రానికి సైన్ చేశారు. విజయనగరం నుంచి హైద్రాబాద్ రావడానికి, ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారకులైన ‘పంతులు గారు’ ఏడిద మల్లేశ్వర శర్మ, కెమెరా విభాగంలో తాను ప్రవేశించడానికి ప్రోత్సహించడంతోపాటు.. ఇప్పటికీ తన వెన్నంటి ఉన్న నాగేశ్వరావు దేవరకొండ, తన గురువులు యువరాజ్, దేవరాజ్, రత్నవేలులకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని వినయంగా చెబుతూ.. సినిమాటోగ్రాఫర్‌గా తన సత్తాను పూర్తి స్థాయిలో ప్రకటించుకోగలిగే పెద్ద కాన్వాసు కోసం ఎదురు చూస్తున్నానని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Right: ఇయర్ ఎండింగ్లో బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ సందడి.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే!
****************************
*Vijayakanth: రియల్ హీరో విజయకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా? కెప్టెన్ స్మృతిలో రాష్ట్రం
***************************
*Hansika: హన్సిక 105 నిమిషాలతో రెడీ అవుతోంది.. ఈసారి ఏం చేస్తుందో?
*************************
*Alphonse Puthren: విజయకాంత్‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
**************************