BroTheAvatar: మై డియర్ మార్కండేయ.. మనల్ని ఆపే మగాడెవడు ‘బ్రో’..!
ABN, First Publish Date - 2023-07-08T18:46:29+05:30
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రంలోని మొదటి సింగిల్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయి తేజ్ (Supreme Hero Sai Tej) ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (Bro). జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని (Samuthirakani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్‌ను మొదలెట్టారు. అందులో భాగంగా శనివారం ‘మై డియర్ మార్కండేయ’ (My Dear Markandeya) అనే మొదటి సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘మై డియర్ మార్కండేయ’ పాట ‘కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మా బీట్స్ బ్రో.. జిందగీనే జూక్‌బాక్స్ బ్రో’ అంటూ ట్రెండీగా ప్రారంభమవగా.. స్టైలిష్ అవతార్‌లో సాయి ధరమ్ తేజ్ తనదైన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లపై తెరకెక్కిన ఈ పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను నృత్యరీతులు అందించారు. చిత్రం కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన పబ్ సెట్‌లో ఈ పాట చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. సమయం మరియు జీవితం గురించి లోతైన భావంతో నిండిన ఈ పాట, సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందరూ డ్యాన్స్ చేసేలా థమన్ మాంచి బీట్స్‌తో ఈ పాటను స్వరపరిచారు. (Bro Movie First Single Out)
ఇక పాట మధ్యలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ పాట రేంజ్ మారిపోయింది. ‘‘మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో.. మళ్లీ పుట్టి భూమికి రానే రావు నిజం తెలుసుకో.. పక్క దిగి నిద్రలేచే ప్రతిరోజు పండగ చేసుకో..’’ అనే పంక్తులు ఆయన వ్యక్తిత్వానికి, పాత్రకు సరిగ్గా సరిపోయేలా రామ్‌జో రాశారు. ఇంకా ఈ పాటలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న ఊర్వశి రౌతేలా తన అందం, నాట్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రామజోగయ్య శాస్త్రి తన ఉల్లాసమైన సాహిత్యంతో మనుషుల స్వభావం మరియు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రతిరోజూ ఓ పండుగలా ఎలా జీవించాలి అనే విలువైన సందేశాన్ని ఇందులో ఇచ్చారు. దుస్తులు దగ్గర నుంచి ఛాయాగ్రహణం, నృత్యం, సంగీతం ఇలా ‘మై డియర్ మార్కండేయ’ పాటను హైలెట్ చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
‘మై డియర్ మార్కండేయ’ పాట లిరిక్స్ విషయానికి వస్తే..
‘‘ఇంట్రో ఆపు.. దుమ్ము లేపు
డ్యాన్స్ బ్రో.. లైక్ బ్రో
హే కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మా బీట్స్ బ్రో.. జిందగీనే జూక్‌బాక్స్ బ్రో
హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో.. మజా పిచ్చ పీక్స్ బ్రో.. మనల్నాపే మగాడెవడు బ్రో
అరె.. లెంగ్త్ చూస్తే ప్రతి లైప్ వెరీ షార్ట్ ఫిల్ము
ఎహే.. కుసింతైనా దాని సైజ్ పెంచలేవు నమ్ము
కానీ నువ్వుగానీ తలుచుకుంటే ప్రతీ ఒక్క ఫ్రేమూ..
భలే కలర్‌ఫుల్‌గా మార్చగలవురో..
మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో..
మళ్లీ పుట్టి భూమ్మిదకి రానే రావు నిజం తెలుసుకో..
పక్క దిగి నిద్రలేచే ప్రతిరోజు పండగ చేసుకో..
అరె.. ఉన్న కాస్త టైమ్‌లోన అంతో ఇంతో అనుభవించిపో..
అరె.. కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మా బీట్స్ బ్రో.. జిందగీనే జూక్‌బాక్స్ బ్రో
హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో.. మజా పిచ్చ పీక్స్ బ్రో.. మనల్నాపే మగాడెవడు బ్రో
ఆయారే.. ఆయారే..
సిత్ర.. మంజరి.. సిత్ర.. మంజరి
మంజరి.. మంజరి.. సిలిపి సిత్ర మంజరి
మే హు సిత్ర మంజరి.. రయ్యంట సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరి
చానా చానా చాకిరి పొద్దంతా మీరు చేస్తిరి
కంపల్సరీ చిల్లవ్వాలి చీకటి రాతిరి
మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇస్తా గ్యారంటీ
మీరు హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ
మీ ఆహా ఓహో లేగా నాకు నచ్చే కామెంట్రీ
మీరు మళ్లీ మళ్లీ రారమ్మన్నా ఇస్తా రీ ఎంట్రీ
ఆయారే.. ఆయారే..
సిత్ర.. మంజరి.. సిత్ర.. మంజరి
మంజరి.. మంజరి.. సిలిపి సిత్ర మంజరి
లైఫ్ అన్నాక ఉండాలిగా రిలీఫ్ అన్న మాట
ఎహే.. మూడొచ్చాక ఆడాలిగా హుషారైన ఆట
బిజీ పన్ల గజిబిజి ఎక్కువైన పూట
రవ్వంత ఖుషి రాంగే కాదట..
మై డియర్..
మై డియర్ మార్కండేయా..
మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో..
మళ్లీ పుట్టి భూమ్మిదికి రానే రావు నిజం తెలుసుకో..
పక్క దిగి నిద్రలేచే ప్రతిరోజు పండగ చేసుకో..
ఉన్న కాస్త టైమ్‌లోన అంతో ఇంతో అనుభవించిపో..ఓ..’’
ఇవి కూడా చదవండి:
**************************************
*Nayakudu: ‘నాయకుడు’కి రాజమౌళి, మహేష్ బాబు సపోర్ట్
**************************************
*Ticket Prices Hike: సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై రచ్చ రచ్చ
**************************************
*Bedurulanka 2012: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి మరో సినిమా..
**************************************
*Aadikeshava: ఆగస్ట్ లిస్ట్‌లోకి మరో మెగా హీరో మూవీ.. చిరు, వరుణ్‌ల మధ్యలో స్లాట్ దొరికేసింది
**************************************
*Tamannaah: బాబోయ్.. ఆ వెబ్ సిరీస్‌లలో ఏముంది.. ఈ పాటలో తమన్నాని చూస్తే అస్సలు తట్టుకోలేరు
**************************************