కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bigg Boss Telugu7: దుమ్ములేపిన బిగ్ బాస్7 తెలుగు ఫినాలే.. రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ

ABN, Publish Date - Dec 29 , 2023 | 10:01 PM

బిగ్ బాస్ 7 తెలుగు రియాలిటీ షో మరోమారు తన సత్తా చాటింది. రియాలిటీ షోలలో తనకు తానే సాటిగా నిలిచింది. ఇటీవలే ముగిసిన తెలుగు బిగ్ బాస్ 7 ఫినాలే.. అత్యధిక టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది.

bb7

బిగ్ బాస్ 7 తెలుగు (Bigg Boss Telugu7) రియాలిటీ షో మరోమారు తన సత్తా చాటింది. రియాలిటీ షోలలో తనకు తానే సాటిగా నిలిచింది. ఇటీవలే ముగిసిన తెలుగు బిగ్ బాస్ 7 ఫినాలే.. తెలుగు శాటిలైట్ మీడియా చరిత్రలోనే 21.7 అత్యధిక టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసినట్లు స్టార్ మా(Star Maa ) ఛానెల్ శుక్రవారం (29.12.2023) తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది.


సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu7) తొలిరోజు సుమారు 3 కోట్ల మంది వీక్షించినట్లు తేలగా, తొలి వారం 5.2 కోట్ల మంది చూశారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు చొప్పున ఈ షోను చూసినట్లుగా బిగ్ బాస్ షో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి 50 శాతం వ్యూవర్స్ పెరిగినట్లు సమాచారం.

Updated Date - Dec 29 , 2023 | 10:07 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!