కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amardeep: కోపం ఉంటే చెప్పండి.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా?

ABN, Publish Date - Dec 20 , 2023 | 01:09 PM

బిగ్‌బాస్ హౌస్‌లో 19మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు కూడా జరగని డ్రామా.. ఫినాలే అయిపోయిన తర్వాత జరుగుతోంది. బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అనంతరం హౌస్ బయట విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్ దీప్ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంపై, దాడిపై తాజాగా అమర్‌ దీప్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Bigg Boss Runner Amardeep

బిగ్‌బాస్ హౌస్‌లో 19మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు కూడా జరగని డ్రామా.. ఫినాలే అయిపోయిన తర్వాత జరుగుతోంది. బిగ్‌బాస్ సీజన్ 7 (Bigg Boss 7) గ్రాండ్ ఫినాలే అనంతరం హౌస్ బయట విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth), రన్నర్ అమర్ దీప్ (Amardeep) అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో పలువురి కంటెస్టెంట్ల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒక ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో పల్లవి ప్రశాంత్ అభిమానులే అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనించి, ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పల్లవి ప్రశాంత్‌పై కూడా కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తనపై జరిగిన దాడిని ఖండిస్తూ.. బిగ్‌బాస్ రన్నర్ అమర్‌ దీప్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో.. (Amardeep Shares Video on Bigg Boss Winner Fans)

‘‘ఇరు రాష్ట్రాల ప్రజలకి పాదాభివందనం. ఇక్కడి వరకు తీసుకొచ్చి.. మీ ఇంట్లో ఒకడిగా చూసుకున్నారు. గెలవలేను అనుకున్న వాడిని గెలుపుదాకా తీసుకొచ్చారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది. ఇంతకంటే గొప్పగా కూడా ఏం కోరుకోవడం లేదు. దీనికి అందరికీ కృతజ్ఞతలు. ఒక బాధాకరమైన విషయం గురించి నేను మాట్లాడకూడదని అనుకున్నాను కానీ.. చెప్పక తప్పడం లేదు. నా కారు మీద దాడి చేస్తూ రాళ్లతో కొట్టారు, కారు అద్దాలు పగలగొట్టారు. బయటికి రా నీ అంతు చూస్తా అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ, అక్క, చెల్లి, భార్య అని ఉంటారు. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? అనేది ఒక్కసారి ఆలోచిస్తే బాగుండు అనేది నా అభిప్రాయం.


అద్దాలు పగలగొట్టినప్పుడు ఆ పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి. తేజు మీద పడ్డాయి. దేవుడి దయవల్ల ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఆ దాడి వల్ల ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే.. ఈ రోజు నేను ఎవరిని కోల్పోయే వాడినే నాకే తెలియదు. ఇలాంటివి.. ఇంకెప్పుడూ ఎవరికీ జరగకూడదు. ఇలాంటివి ఇంకెవరికీ ఎప్పుడూ చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి పడతాను. కామెంట్లు పెట్టండి.. వీడియోలు పెట్టండి చూస్తాను. ఎలాగో పెట్టారు.. నా ఫ్యామిలీని బాధపెట్టారు.. నడిరోడ్డు మీద నిలబెట్టేశారు.

అయితే నేను ఏదీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, నేను అభిమానించే నా హీరో మాస్ రాజా రవితేజ (Ravi Teja)గారు.. ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజే నేను గెలిచాను. నేను ఆ గెలుపులోనే బయటికి వచ్చాను. గెలిచి ఆనందంతో బయటికి వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టేశారు. చాలా బాధేసింది. పర్లేదు.. నన్ను అభిమానించే వాళ్లు, ప్రేమించే వాళ్లు ఉన్నారు కాబట్టి.. దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి, భార్యకి ఏం కాలేదు. నాకు ఏమైనా పర్లేదు. మన ఇంట్లోని వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కప్పు, డబ్బు పోతే తెచ్చుకోవచ్చు. మనిషి పోతే తిరిగి తీసుకురాలేం. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. దయచేసి ఇంకెప్పుడూ, ఎవరి దగ్గరా ఇలా చేయకండి. థ్యాంక్యూ సో మచ్. ఇంకా నాపై కోపం ఉంటే.. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి.. మీ ఇష్టం. కానీ ఎవరికీ ఇలాంటివి చేయకండి. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు..’’ అని చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

====================

*Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్ అంటూ వార్తలు.. ‘నేనేం తప్పు చేశా’ అంటూ వీడియో వదిలిన విన్నర్

*********************************

*కార్పొరేట్‌ గుప్పెట్లో చిత్ర పరిశ్రమ: గేయ రచయిత హాట్ హాట్ కామెంట్స్

**********************************

*Sara Ali Khan: సారా అలీఖాన్ కోరిక ఏంటో తెలుసా?

**********************************

Updated Date - Dec 20 , 2023 | 01:09 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!