VJSunny: బిగ్ బాస్ సన్నీ కి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ABN, First Publish Date - 2023-05-13T11:46:59+05:30
'అన్‌స్టాపబుల్' సినిమా ప్రచారం కోసం ఒక వీడియో చిత్రీకరిస్తూ ఉండగా, సప్తగిరి చేతిలో వున్న పిస్టల్ పేలడంతో, అందులోంచి డమ్మి బుల్లెట్ వచ్చి సన్నీ మొహానికి తగలటం తో, సన్నీ గాయపడ్డాడు అని తెలుస్తోంది. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ (BiggBoss) తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలామందిలో సన్నీ (VJ Sunny) ఒకడు. బిగ్ బాస్ సీజన్-5 విజేతగా నిలిచినా సన్నీ ఆ తరువాత వెబ్ సిరీస్, సినిమాలు చాలా చేస్తున్నాడు. అతనికి ఆ షో అంత గొప్ప గుర్తింపు ఇచ్చింది అనే చెప్పాలి. మొదటి న్యూస్ యాంకర్, తరువాత సీరియల్స్, టీవీ షోస్ చేసిన విజె సన్నీ ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ గా వున్నాడు. ప్రస్తుతం 'అన్‌స్టాపబుల్' (Unstoppable) అనే సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రత్నబాబు (Diamond Ratnababu) దర్శకుడు కాగా, ఈ సినిమా జూన్ 9 (June() న విడుదల చేస్తున్నారు చిత్ర నిర్వాహకులు అప్పుడే ప్రకటన కూడా ఇచ్చారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సంఘటన బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రోమో చేస్తున్నప్పుడు ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న సన్నీ గాయపడ్డాడు అని చెపుతున్నారు. 30 ఇయర్స్ పృథ్వి (Prudhvi), కమెడియన్ సప్తగిరి (Saptagiri), సన్నీ (VJSunny) మీద ఈ సన్నివేశం చిత్రీకరిస్తుండగా సప్తగిరి, పృథ్వి వేపు తిరిగి ఎదో డైలాగ్ చెప్పి, అంతలోనే వాళ్ళిద్దరి దగ్గరికి సన్నీ రాగానే సన్నీ మొహం మీద సప్తగిరి పిస్టల్ పేల్చడం జరిగింది. వెంటనే సన్నీ కిందపడిపోయినట్టుగా కనిపించింది కానీ ఆ వీడియో అక్కడితో ఆగిపోయింది. కానీ సప్తగిరి పిస్టల్ నుండి బులెట్ బయటకి వచ్చి సన్నీ మొహానికి తగిలింది అని అంటున్నారు.
ప్రస్తుతం సప్తగిరి, పృథ్వి, సన్నీ వున్న ఈ సన్నివేశపు వీడియో సాంఘీక మాధ్యమంలో బాగా వైరల్ అవుతోంది. ఈ సన్నివేశం లో సప్తగిరి, పోలీస్ గెటప్‌లో ఉండగా, అన్‌స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడు అని అంటూ గన్ పట్టుకుని పృథ్వీరాజ్‌ను అడిగాడు. పృథ్వి వెంటనే నాకేమి తెలుసు అంటూ అటువైపుగా వస్తున్నా సన్నీని అడిగితే తెలుస్తుంది అంటూ అతనివైపు చూపించాడు. సప్తగిరి వెంటనే పిస్టల్ సన్నీ మొహం మీద పెట్టి పేల్చడంతో బుల్లెట్ సన్నీ కి తగిలింది. అది డమ్మీ బుల్లెట్ అయినా కూడా సన్నీకి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.