RGV: ‘వ్యూహం’ బెడిసికొట్టింది.. వర్మా.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:23 AM
తన రూపొందించిన ‘వ్యూహం’తో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలను సృష్టించాలని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నో కలలు కంటున్నారు. అందుకే ‘వ్యూహం’ సినిమాని శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రం అనేంతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆ ‘వ్యూహం’ ఆరంభంలోనే బెడిసికొడుతుండటం చూసి.. వర్మ అండ్ బ్యాచ్ ముఖాల్లో నెత్తురు చుక్క కరువవుతోంది.
తన రూపొందించిన ‘వ్యూహం’ (Vyuham)తో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలను సృష్టించాలని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నో కలలు కంటున్నారు. అందుకే ‘వ్యూహం’ సినిమాని శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రం అనేంతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆ ‘వ్యూహం’ ఆరంభంలోనే బెడిసికొడుతుండటం చూసి.. వర్మ అండ్ బ్యాచ్ ముఖాల్లో నెత్తురు చుక్క కూడా లేదంటే.. ప్రజలు, ప్రేక్షకులు ఎంతగా అప్‌డేట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుందనే సామెతలా.. అసలు విడుదల కానీ సినిమాకు ఇన్ని ఆర్భాటాలు ఎందుకో.. ఆ వర్మా అండ్ బ్యాచ్‌కే తెలియాలి.
చీకట్లో గర్జన.. ఇదేనా ‘వ్యూహం’
‘వ్యూహం’ సినిమాగా ఏమోగానీ.. శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం వర్మా అండ్ వైసీపీ బ్యాచ్ ‘వ్యూహం’ బాగా పనిచేసింది. ఏంటా వ్యూహం అనుకుంటున్నారా? ఈ వేడుకకు జనాలు తండోపతండాలుగా వస్తారని భారీగా వేడుకను ప్లాన్ చేశారు. కానీ వారి వ్యూహం బెడిసి కొట్టింది. జనాలు లేక, రాక వేడుక బోసిపోయింది. ఈ విషయం ఎక్కడ బయటికి వస్తుందో అని.. వారు రచించిన వ్యూహం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఖాళీ కుర్చీలు ఎక్కడ కనిపిస్తాయో అని.. లైట్స్ ఆపేసి వేడుకను హడావుడిగా ముగించేశారు. ఈ లైట్స్ ఆపేసిన వ్యూహం ఏదైతే ఉందో.. అది మాత్రం బాగానే వర్కవుట్ అయింది. కానీ ఏం లాభం.. అది కూడా జనాలకి తెలిసిపోయింది.
యుద్ధం చేతకానివాడే అడ్డదారులు వెతికేది
నిజమే.. యుద్ధం చేతకాని వాడే అడ్డదారులు వెతుకుతాడు. ప్రజాక్షేత్రంలో ఫేస్ టు ఫేస్ తేల్చుకోలేక ఎదుటివారి క్యారెక్టర్‌ని.. ఇలాంటి వ్యూహాల పేరుతో నాశనం చేయాలని చూడటం అడ్డదారులు తొక్కడం కిందకే వస్తుంది. అయితే ఇది ఒకప్పుడు వర్కవుట్ అయిందేమోగానీ, ఈసారి ప్రజలు అలెర్ట్‌గా ఉన్నారు, అప్‌డేట్ అయ్యారు. ఆ విషయం ‘వ్యూహం’ ప్రీ రిలీజ్ వేడుకగా.. తెలియాల్సిన బ్యాచ్‌కి తెలిసివచ్చేలా చేశారు ప్రజలు, ప్రేక్షకులు. ఈ వేడుకకు ఎప్పటి మాదిరిగానే భారీగా జనాలను తరలించాలని వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందునా సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవ్వాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతకీ ప్రారంభం కాకపోవడంతో.. వచ్చిన ఆ కొంతమంది కూడా వెళ్లిపోయారు. ఇక చేసేది లేక, వర్మా అండ్ వైసీపీ టీమ్ ఖాళీ కుర్చీలు కనిపించకుండా లైట్స్ ఆపేసి కార్యక్రమాన్ని ముగించేశారు. ఈ దెబ్బతో వారికి కూడా వారి ‘వ్యూహం’పై ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
====================
*Sharvari Wagh: ‘నీ పేరు ఏంటని?’ దీపికా పదుకొనే అడిగింది
********************************
*Game Changer: మెగాభిమానులకు నిరాశ.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే చరణ్ ఫిల్మ్
*****************************
*Ala Ninnu Cheri: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ‘అలా’ వచ్చేసింది
***************************
*Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?
***************************
*Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్
***************************