కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Biggboss 7 : చివరి కెప్టెన్సీ కోసం ఇద్దరి మధ్య పోటీ.. బాస్‌ ఏం చేశాడంటే! 

ABN, First Publish Date - 2023-11-25T13:17:47+05:30

బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 చివరిదశకు చేరుకోబోతుంది. 82వ రోజున చివరి కెప్టెన్సీ టాస్క్‌ కోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ ఇంట్లో కెప్టెన్‌ కానివారు ముగ్గురు ఉన్నారు.  అమర్‌దీప్‌, రతిక, అశ్విని. ఈ ముగ్గురిలో కెప్టెన్‌ అయ్యే ఛాన్స్  అమర్‌కే ఎక్కువ ఉన్నాయి.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 (Biggboss 7)చివరిదశకు చేరుకోబోతుంది. 82వ రోజున చివరి కెప్టెన్సీ టాస్క్‌ (Last Captaincy task) కోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ ఇంట్లో కెప్టెన్‌ కానివారు ముగ్గురు ఉన్నారు.  అమర్‌దీప్‌, రతిక, అశ్విని. ఈ ముగ్గురిలో కెప్టెన్‌ అయ్యే ఛాన్స్  అమర్‌కే ఎక్కువ ఉన్నాయి. అతడు మొదటి వారం నుంచి పవర్‌ అస్త్ర  కోసం, కెప్టెన్సీ కోసం ఎంతో కష్టపడ్డాడని అందరికీ తెలిసిందే. అయితే కాలం కలిసి రాక అతనికి కెప్టెన్సీ రాలేదు. అయితే ఇప్పుడున్న ఇంటి సభ్యుల్లో కెప్టెన్‌ అయ్యే అవకాశం అతనికే ఉందని హౌస్‌మేట్స్‌ గుసగుసలాడుకుంటున్నారు. అలాగే ఇంటి సభ్యులు సపోర్ట్‌ కూడా అతనికి బాగానే ఉంది. దాదాపు అతను  కెప్టెన్‌ అయిపోయినట్లే అని భావిస్తున్న తరుణంలో బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. 

అవకాశం వచ్చింది పోగొట్టకు అన్న.. ప్లీజ్: అమర్ (Amardeep)

కెప్టెన్సీ కోసం బిగ్‌ బాస్‌.. కంటెస్టెంట్స్‌కు మెషీన్‌ గన్‌ టాస్క్‌ ఇచ్చారు. అమర్‌దీప్‌తో పాటు అర్జున్‌ కూడా చివరి కెప్టెన్సీపై ఆశలు పెట్టుకున్నాడు. రెండుసార్లు కెప్టెన్‌ అవ్వడం తన భార్య కోరిక అని చెప్పాడు అర్జున్. దీంతో అమర్‌కు సపోర్ట్‌ చేయాలనుకున్న కొందరు కంటెస్టెంట్స్‌.. అర్జున్‌కు సపోర్ట్‌ చేయడం మొదలుపెట్టారు. అర్జున్‌ లేదా యావర్‌లో ఒకరిని తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యావర్‌ స్వతహాగా ముందుకొచ్చి కెప్టెన్సీ రేసు నుండి తీసేయమన్నాడు.  అంతే కాకుండా అర్జున్‌ భార్య తనకు వదినతో సమానమని, వదిన కోసం ఏమైనా చేస్తానని అన్నాడు. ఈ మాటలు విన్న శివాజీ ఎమోషనల్‌ అయ్యాడు. అశ్విని సైతం స్వీట్‌ అంటూ యావర్‌కు ఫ్లయింగ్‌ కిస్సులు ఇచ్చింది. యావర్‌ తరహాలోనే గౌతమ్‌ అర్జున కోసం కెప్టెన్సీ టాస్క్‌ నుంచి తప్పుకొన్నారు. అందరూ ఊహించినట్లుగానే ఫైనల్‌ రౌండ్‌లో అర్జున్‌, అమర్‌దీప్‌ మిగిలారు. ఇక వీరిద్దరిలో ఎవరు కెప్టెన్‌ అవ్వాలి, ఎవరు తప్పుకోవాలి అనే నిర్ణయం శోభా, శివాజీ చేతిలోకి వెళ్లింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే తనను కెప్టెన్‌ చేశాడు కాబట్టి అమర్‌ను తను కెప్టెన్‌ చేయాలి అనుకుంటున్నానని శోభా చెప్పింది. ఆ పాయింట్‌ అర్జున్‌కు నచ్చలేదు. చర్చకు దిగాడు. ‘‘ఫ్రాంక్‌గా చెప్తున్నాను నువ్వు కెప్టెన్‌ అవ్వడం నాకు ఇష్టం లేదు’’ అంటూ అర్జున్‌ ఈగోను హర్ట్‌ చేసింది శోభా. దీంతో తనకే కెప్టెన్సీ కావాలని అర్జున్‌ బలంగా నిలబడ్డాడు. ఆ తర్వాత శివాజీ.. అర్జున్‌కు సపోర్ట్‌ చేస్తున్నట్టు చెప్పాడు. అర్జున్‌ భార్య తనకు కూతురిలాంటిది అని, తను అర్జున్‌ రెండోసారి కెప్టెన్‌ అయితే చూడాలనుకుంది కాబట్టి తనకు సపోర్ట్‌ చేస్తానని ప్రకటించాడు. దీంతో అమర్‌ షాక్‌ అయ్యాడు. 

అర్జున్‌ భార్య గురించి ఆలోచించి తనను కెప్టెన్‌ చేస్తే, నా తల్లిదండ్రుల గురించి ఆలోచించి నన్ను కూడా కెప్టెన్‌ చేయొచ్చుగా అని శివాజీని బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు అమర్‌దీప్‌. అదే క్రమంలో ఎమోషనల్‌ కూడా అయ్యాడు. సెంటిమెంట్‌తో మాట్లాడవద్దని అమర్‌కు గట్టిగా చెప్పేశాడు శివాజీ. శోభా కూడా తన నిర్ణయాన్ని మార్చుకోమని శివాజీని బతిమిలాడింది. చేతులు పట్టుకొని ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఇది ఒక్కటి చేయమని రిక్వెస్ట్‌ చేసింది. అయినా కూడా శివాజీ.. అర్జున్‌కు సపోర్ట్‌ చేయాలని బలంగా నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చర్చ జరుగుతుండగా శివాజీ ఒక మాట అన్నాడు. ఇలా ఫీల్‌ అయ్యేవాడివి కెప్టెన్‌ ఎలా అవుతావని, ఒకవేళ కెప్టెన్సీ వచ్చినా డిప్యూటీగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచన నీకు లేదని అమర్‌కు సూటిగా చెప్పేశాడు. అంతే కాకుండా అశ్విని కూడా అవకాశం కోసం ఎదురుచూస్తుందని, తనకు డిప్యూటీగా అవకాశం ఇద్దామనే ఆలోచనే నీకు లేదని అమర్‌తో అన్నాడు. దీంతో అమర్‌ కెప్టెన్‌ అయితే ప్రియాంక, శోభాలను డిప్యూటీలను చేస్తాడనే కారణంతో కూడా శివాజీ.. అమర్‌కు సపోర్ట్‌ చేయడం లేదని భావిస్తున్నారు ఆడియన్స్ .  అర్జున్‌ ఒప్పుకుంటే తనకు ఓకే అని శివాజీ చెప్పడంతో.. అర్జున్‌ దగ్గరకు వెళ్లి బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు అమర్‌.  శోభ అన్న మాటలు తనను ట్రిగర్‌ చేశాయని, అందుకే  కెప్టెన్సీ వదులుకోవడానికి తను సిద్థంగా లేనని అర్జున్‌ గట్టిగా చెప్పేశాడు. దీంతో అమర్‌ కూడా ఆశలు వదులుకున్నాడు. ‘‘ఇంత అడుక్కున్న తర్వాత నాకు కెప్టెన్సీ అవసరం లేదు. నేనే పనికిమాలినోడిని. నాకు గేమ్స్‌ ఆడడం చేతకాదు’’ అంటూ పక్కకు వెళ్లిపోయాడు అమర్‌.. అప్పటికే బిగ్‌ బాస్‌ ఎన్నోసార్లు అడిగినా శివాజీ, శోభా తమ నిర్ణయాన్ని చెప్పకపోవడంతో చివరి కెప్టెన్సీ టాస్క్‌ను రద్దుచేస్తున్నట్టు బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. అసలు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. 


Updated Date - 2023-11-25T13:17:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!