Bandla Ganesh: జాగ్రత్తగా ఉండండి.. ఏ క్షణం ఏం జరుగుతుందో భయంగా ఉంది
ABN, First Publish Date - 2023-12-02T21:34:53+05:30
కాంగ్రెస్ అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఈ రాత్రికి ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కాపలా ఉండండి. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది, ఎవరిని నమ్మొద్దు ఇది నా విజ్ఞప్తి విన్నపం అంటూ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
కాంగ్రెస్ అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఈ రాత్రికి ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కాపలా ఉండండి. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది, ఎవరిని నమ్మొద్దు ఇది నా విజ్ఞప్తి విన్నపం అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(BANDLA GANESH) చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలవుతున్న క్రమంలో ఇప్పుడు బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన గతంలోనే ఓ మీడియాతో మాట్లాడుతూ ఈమారు కాంగ్రెస్ వస్తుంది, రేవంత్ సీఎం అవుతాడు.. నేను 7 రాత్రికే ఎల్బీ స్టేడియానికి వెళ్లి పడుకుంటానంటూ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు సర్వేలు, ప్రజలు ఈ సారి మార్పు తప్పదంటూ వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఎన్నికల అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటాయని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సుకత ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా 70 పైనే సీట్లు వస్తాయంటూ ప్రకటించింది. డిసెంబర్ 4న క్యాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది.
ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో సర్వత్రా ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో బండ్ల గణేశ్ (BANDLA GANESH) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఆయన వ్యాఖ్యల వెనక మతలబు ఏంటనే చర్చ ఇప్పుడు మొదలైంది.