కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandla Ganesh: మళ్ళీ సంచలన వ్యాఖ్య, వైఎస్ జగన్ ని ఉద్దేశించి అన్నదేనా...

ABN, First Publish Date - 2023-10-14T13:12:55+05:30

బండ్ల గణేష్ మళ్ళీ ఇంకో సంచలన వ్యాఖ్య చేసాడు. ఈసారి తన సాంఘీక మాధ్యమంలో ఈ వ్యాఖ్య చేసాడు, ఇది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ని ఉద్దేశించి అన్నది అని నెటిజన్స్ ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు

Bandla Ganesh

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (BandlaGanesh) మరోసారి వార్తల్లో వున్నాడు. ఈసారి తన సాంఘీక మాధ్యమంలో ఒక రెండు వాక్యాలు పెట్టాడు బండ్ల గణేష్, అవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ (YSJagan) ని ఉద్దేశించి అన్నట్టుగా వున్నాయి అని నెటిజన్స్ అంటున్నారు. ఇంతకీ అతను పెట్టిన ఆ రెండు వాక్యాలు గొప్ప అర్థాన్ని సూచిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా వై ఎస్ జగన్ తన ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ (PawanKalyani) ని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు, బండ్ల గణేష్ అలా మాట్లాడ వద్దు అని జగన్ కి విజ్ఞప్తి చేసాడు.

ఇప్పుడు మళ్ళీ జగన్ ను ఉద్దేశించి ఈ రెండు వాక్యాలు తన సాంఘీక మాధ్యమంలో పెట్టాడు అని అంటున్నారు. ఇంతకీ అతని పెట్టిన ఆ వ్యాఖ్య ఏంటంటే, "పరిపాలించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించటం మొదలుపెడితే, ప్రజలు పతనాన్ని మీకు బహుమతిగా ఇస్తారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎంతోమందికి చరిత్ర చెప్పింది ,దానికి మీరు అతీతులు కాదు !" అని అన్నాడు గణేష్.

అంటే జగన్ ని ప్రజలు పట్టం కట్టబెట్టారు, ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ అతను తన అధికారాన్ని ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు అని ఉద్దేశం కావచ్చు అని అంటున్నారు. ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు ఈసారి బుద్ధి చెపుతారు నీకు అన్నట్టుగా వచ్చే అర్థాన్ని ఆ రెండు వాక్యాలు సూచిస్తున్నాయి. ఇంతకు ముందు చరితలో అలాంటి సందర్భాలు ఎన్నో వున్నాయి అని కూడా చెప్పాడు. బండ్ల ఇలాంటి వ్యాఖ్యలతోనే ఈమధ్య వార్తల్లో ఉంటూ వస్తున్నాడు, ఇప్పుడు అతను పెట్టిన ఈ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత అయిన చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu) ని అక్రమ అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుని చాలామంది ఖండించారు, ఇది కేవలం రాజకీయ కక్షతో కూడుకున్న చర్య అని, అధికారాన్ని ప్రతిపక్షం లేకుండా చెయ్యడానికి ముఖ్యమంత్రి జగన్ వాడుకుంటున్నారని చాలామంది ఆరోపించారు. నిన్న ప్రముఖ దర్శకుడు దేవ కట్టా (DevaKatta) కూడా జగన్ ని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-10-14T13:23:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!