Bhagavanth Kesari: సెంచరీ కొట్టిన బాలయ్య, వరసగా మూడో సినిమా
ABN, First Publish Date - 2023-10-25T17:40:05+05:30
వంద కోట్ల క్లబ్బులోకి వరసగా మూడోసారి బాలకృష్ణ సినిమా 'భగవంత్ కేసరి' చేరింది. ఇంతకు ముందు 'అఖండ', 'వీరసింహా రెడ్డి' సినిమాలు ఈ వందకోట్ల క్లబ్ లో ఉండగా, ఇప్పుడు ఈ సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా స్ట్రాంగ్ గా వున్న ఈ సినిమా దసరా విన్నర్ అని ప్రకటించారు
దసరా పండగకు విడుదలైన సినిమాలలో నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) నటించిన 'భగవంత్ కేసరి' #BagavanthKesari విన్నర్ గా నిలిచింది. ఆ చిత్ర నిర్వాహకులు ఇచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఆరు రోజులకు గాను ఈ సినిమా రూ. 104 (Balakrishna's third consecutive film in Rs 100 crore club) కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించింది అని చెపుతున్నారు. ఇలా వందకోట్లు వసూల్ చెయ్యడం బాలకృష్ణ కి వరసగా మూడో సినిమా. ఇంతకు ముందు 'అఖండ' #Akhanda, 'వీరసింహారెడ్డి' #VeerasimhaReddy, ఇప్పుడు 'భగవంత్ కేసరి' ఇలా వసూలు చేసిన వాటిలో వున్నాయి.
సోమవారం, మంగళవారం, సెలవు దినాలు కావటం, ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావటంతో కుటుంబంతో సహా ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి ఈ సినిమా చూసినట్టుగా తెలుస్తోంది. అందుకే కలెక్షన్స్ పడిపోకుండా వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా ఉన్నాయని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అనిల్ రావిపూడి (AnilRavipudi) ఈ సినిమాకి దర్శకుడు కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల (Sreeleela) మధ్య వచ్చే తండ్రి కూతుళ్ళ సన్నివేశాలు అందరినీ అలరించాయని అంటున్నారు. అలాగే ఈ సినిమా ఒకటి రెండు వారాలు కాకుండా ఎక్కువ రోజులు ఆడే సినిమాగా కూడా ఉంటుందని అంటున్నారు.
ఇక ఆరు రోజులకు గాని 'భగవంత్ కేసరి' రూ. 51.80 కోట్ల రూపాయలు షేర్ సంపాదించింది అని చెపుతున్నారు. ఇది కొన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కూడా అయిందని కూడా అంటున్నారు. ఇంకా రెండో వారంలో ఈ సినిమాకి ఒక పాటని ఈ సినిమాలో జత చేరుస్తున్నట్టు అది అభిమానులకి కనువిందుగా ఉంటుందని కూడా చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కథానాయికగా చేసింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (ArjunRampal) విలన్ గా నటించారు. 'మంగమ్మగారి మనవడు' సినిమా నుండి పాపులర్ అయిన పాట 'దంచవే మేనత్త కూతురా' ని ఈ సినిమాలో రీమిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అదే పాటని రెండో వారంలో జతచేయనున్నారు అని కూడా అంటున్నారు. థమన్ (SSThaman) దీనికి సంగీతం సమకూర్చారు.