కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్.. షరతులు ఏంటంటే?

ABN, Publish Date - Dec 22 , 2023 | 06:34 PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. అతనికి, అతనితో పాటు అరెస్ట్ అయిన ముగ్గురుకి కూడా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు కూడా ఇందులో ఉన్న విషయం తెలిసిందే.

Pallavi Prashanth

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth)కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. అతనికి, అతనితో పాటు అరెస్ట్ అయిన ముగ్గురుకి కూడా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ (Bail)ను మంజూరు చేసింది. పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు కూడా ఇందులో ఉన్న విషయం తెలిసిందే. అంతకు ముందు పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు కస్టడీకి కోరారు. పల్లవి ప్రశాంత్‌ను ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరగా.. నాంపల్లి కోర్టు ఇచ్చిన షరతులతో ఇచ్చిన బెయిల్ అతనికి కాస్త ఊరట లభించినట్లయింది.

పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు విధించిన షరతులు (Conditions) ఇవే..

పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించడం కానీ, మీడియాతో మాట్లాడటం వంటివి చేయకూడదు. అతనికి రూ. 15 వేలు మనీతో పాటు ఇద్దరు షూరిటీ‌లు ఇవ్వాలి. ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. కోర్టు తీర్పు అనంతరం ఆయనని విడుదల చేసే అవకాశం ఉంది.


అసలు ఏం జరిగిందంటే..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) గ్రాండ్ ఫినాలే‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. ఆ షో ముగిసిన అనంతరం బిగ్ బాస్ హౌస్ బయట తన అభిమానులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రశాంత్ అభిమానులు, ఇతర కంటెస్టెంట్ల అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ప్రశాంత్ అభిమానులు అక్కడ విధ్వంసం సృష్టించారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అలాగే పబ్లిక్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్‌పై, అలాగే గొడవకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. అతను పరారీలో ఉండటంతో.. అతని కోసం గాలించి, చివరికి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sravanthi: జెమిని టీవీలో సరికొత్త సీరియల్.. ఎప్పటి నుంచంటే?

*******************************

*పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!

*********************************

*Jyothika: ముంబైకి మకాం అందుకే.. అసలు విషయం చెప్పేసిన జ్యోతిక

*******************************

Updated Date - Dec 22 , 2023 | 07:41 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!