సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు

ABN, First Publish Date - 2023-05-05T12:27:12+05:30

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) అనే టైటిల్‌తో ఓ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ కేరళ స్టోరీ ఏమోగానీ.. ఈ కేరళ స్టోరీ చూడండి అంటూ..

AR Rahman on Real Kerala Story
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్లింలు మసీదును ఎలా చూస్తారో తెలియంది కాదు. వారు పరమ భక్తితో ప్రార్థనలు చేసే ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో ముస్లింలకు మినహా.. ఇతర అన్యమతస్థులకు ముఖ్యంగా ఆడవారికి ప్రవేశం ఉండదని అంటుంటారు. అలాంటి మసీదులో ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో ఓ పెళ్లి జరిగింది. షాక్ అవుతున్నారా? ఇది నిజం. ముస్లిం పెద్దలే దగ్గరుండి మరీ ఈ పెళ్లిని చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మతసామరస్యాన్ని చాటి చెప్పే ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని తాజాగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. మానవత్వాన్ని చాటిన పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కరించారు.

విషయంలోకి వస్తే.. తాజాగా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) అనే టైటిల్‌తో ఓ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ కేరళ స్టోరీ ఏమోగానీ.. ఈ కేరళ స్టోరీ చూడండి అంటూ.. ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న సమాచారం ప్రకారం.. కేరళ అలప్పుజ చెరువల్లిలోని ఒక మహిళ తన కుమార్తె పెళ్లి చేయడానికి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. దీంతో తన కుమార్తె వివాహానికి సాయం చేయాలంటూ అక్కడి ముస్లిం కమిటీని ఆశ్రయించింది. కుమార్తె పెళ్లి విషయంలో ఆమె పడుతున్న ఇబ్బందులను గమనించిన అక్కడి ముస్లిం పెద్దలు.. ఆర్థిక సాయమే కాకుండా.. తమ పవిత్ర స్థలమైన మసీద్‌లోనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి (Hindu wedding inside mosque) జరిపి.. మతసామరస్యాన్ని చాటిచెప్పారు. ఇప్పుడీ వీడియో దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమవుతోంది.

ఈ వీడియోని చూసిన సంగీత దర్శకుడు రెహమాన్.. సంతోషం వ్యక్తం చేశారు. వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి.. ‘‘మీరు చేసిన ఈ పని.. వ్యవస్థని మార్చేలా ఉంది.. మీ మానవత్వానికి జోహార్లు’’ అని ఈ విషయంలో తను ఎంతగానో గర్వపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక మసీదులో హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేయడమే కాకుండా.. పెళ్లి కుమార్తెకి ముస్లిం పెద్దలు 10 తులాల బంగారం, 20 లక్షల క్యాష్ కానుకగా ఇచ్చారు. ఈ పెళ్లి చూసేందుకు తరలివచ్చిన దాదాపు 1000 మందికిపైగా అతిథులకు వెజ్ అండ్ నాన్ వెజ్ విందు ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి జరిపిన ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. దేశంలో మతాల పేరుతో జరుగుతున్న హింసని ఆపాలనే మెసేజ్‌ని ఈ పెళ్లి ద్వారా ఇవ్వాలనుకున్నాం. అందుకే మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. 2020లో కేరళలో జరిగిన ఈ వివాహ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ వీడియోపై రెహమాన్ రియాక్ట్ అవడంతో.. మళ్లీ వార్తలలోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Ugram Twitter Review: సినిమా బాగుందంటున్నారు కానీ..

*Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..

*Vanitha Vijay Kumar: రిలేషన్‌ మాత్రమే.. పెళ్ళి జరగలేదు.. దయచేసి అలా రాయవద్దు

*Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

*Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..

*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

Updated Date - 2023-05-05T12:33:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!