Anasuya: కిందకు లాగుతూనే ఉంటారు.. కానీ నేనేంటో చూపిస్తా!
ABN, First Publish Date - 2023-08-20T17:15:16+05:30
అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. శనివారం ఏడుస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడం, ఆ వీడియో పెట్టడానికి కారణమేంటో చెప్పడంతో మరోసారి ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది. దాంతో హేటర్స్‌ను ఉద్దేశిస్తూ నటి అనసూయ ఆదివారం మరో ట్వీట్ చేశారు.
అనసూయ (Anasuya) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. శనివారం ఏడుస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడం, ఆ వీడియో పెట్టడానికి కారణమేంటో చెప్పడంతో మరోసారి ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది. దాంతో హేటర్స్‌ను ఉద్దేశిస్తూ నటి అనసూయ ఆదివారం మరో ట్వీట్ చేశారు (tweet on haters)
‘‘మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటివ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వ్యక్తులనే భావన పొందుతారు. ఆ బాధపడిన వ్యక్తే బలంగా నిలబడితే మాత్రం తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తారు. కపటధోరణి అంటే ఇదేనేమో! ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా ఉండేలా నేను జీవితంలో ముందుకెళ్తా. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చేసి చూపిస్తా. ఎందుకంటే, నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్ పొందాలనుకుంటారు. బతికినంత కాలం చావాలనిపించేలా ట్రీట్ చేసి.. చచ్చాక ఉద్థరించాలనుకుంటారు! ఏది ఏమైనా ఇంతకముందు నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడ్డా. ఇక ముందూ ఇలాగే ఉటాఆ. హేటర్స్‌ను నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లందరినీ ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరే నా బలం. నా శక్తి’’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. అనంతరం మరో ట్వీట్‌లో.. ట్వీట్ చేశారు. ‘‘ఐ యామ్ సో సారీ.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్‌మీడియా వేదికల్లో మనం ఉంటడానికి అసలు కారణం ఏంటి? అటెన్షన్ పొందడం కోసం కాదా?’’ అని ఆమె ప్రశ్నించారు. దీంతో మరోసారి అనసూయ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనికి నెట్టిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి!