కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anasuya: మా ఆయన అప్పుడప్పుడు చేస్తారు.. నేను మాత్రం ప్రేమగా చేస్తా..!

ABN, First Publish Date - 2023-10-02T18:33:25+05:30

టైటిల్ చూసి ఇదేదో బూతు అని అనుకుంటారేమో.. అలాంటిదేమీ కాదు కానీ అనసూయ ఇచ్చిన ఈ సమాధానం మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాజాగా ‘పెద్దకాపు 1’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ.. నెటిజన్లతో కాసేపు సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఓ నెటిజన్ అనసూయ వ్యక్తిగత విషయానికి సంబంధించిన ప్రశ్నని అడుగగా.. సీరియస్ అవకుండా.. చాలా కూల్‌గా ఆమె సమాధానమిచ్చింది.

Anasuya with Her Husband

టైటిల్ చూసి ఇదేదో బూతు అని అనుకుంటారేమో.. అలాంటిదేమీ కాదు కానీ అనసూయ (Anasuya) ఇచ్చిన ఈ సమాధానం మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై అంతా హాట్ హాట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు ఎందుకు అనసూయ ఇలా చెప్పుకొచ్చింది. ఇలాంటి మాటలు ఆమె ఎవరికి సమాధానంగా చెప్పింది అనే విషయంలోకి వస్తే..

యాంకర్‌గా స్టార్‌డమ్ అనుభవించిన అనసూయ (Anchor and Actress Anasuya) ఇప్పుడు నటిగా తన కెరీర్‌ని కొనసాగిస్తుంది. తన దగ్గరకు వచ్చిన పాత్రలలో మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ.. నటిగానూ దూసుకెళుతోంది. అయితే సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియాతోనూ అనసూయకు అనుబంధం ఉంది. ఎంత అనుబంధం అంటే.. గ్యాప్ దొరికితే కాసేపు ముచ్చటించేంత. అలాగే సోషల్ మీడియాలో ఆమె ధైర్యంగా ఎలాంటి నెటిజన్‌కైనా క్లాస్ ఇస్తుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. నెటిజన్లు శృతి మించినప్పుడు తనదైన తరహాలో పంచులు పేలుస్తుంటుంది. ఆ విధంగా అనసూయకు సోషల్ మీడియా మంచి కాలక్షేపంగా మారుతోంది.


తాజాగా అనసూయ అక్కమ్మ (Akkamma)గా నటించిన ‘పెదకాపు 1’ (Peddha Kapu 1) సినిమా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘పెదకాపు 1’లో అనసూయ చేసిన అక్కమ్మ పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమా అనంతరం అనసూయ తన తదుపరి చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తనకు దొరికిన ఖాళీ టైమ్‌లో సోషల్ మీడియాని పలకరించింది. నాకు 40 నిమిషాల టైమ్ ఉంది. ఈ టైమ్‌లో ఎవరైనా, ఏదైనా ప్రశ్న అడగండి.. సమాధానం చెబుతాను అంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులకు మెసేజ్ ఇచ్చింది. ఈ చాట్‌లో ‘పెద్దకాపు 1’ సినిమాకు సంబంధించి నెటిజన్లు చాలా మంది ప్రశ్నలు అడిగితే వాటికి అనసూయ సమాధానం చెబుతూ వచ్చింది. ఒక నెటిజన్ మాత్రం అనసూయకు సంబంధించిన ఓ వ్యక్తిగత ప్రశ్నను అడిగాడు. అనసూయ సీరియస్ అవకుండా.. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చింది.


ఇంతకీ నెటిజన్ ఏమని అడిగాడంటే.. ‘మీ ఇంట్లో ఎవరు వంట బాగా చేస్తారు? మీరు చేస్తారా.. లేక మీ భర్తా?’ అని అడుగగా.. అందుకు అనసూయ సమాధానమిస్తూ.. ‘ఈ విషయంలో నా భర్త కంటే నేనే బెస్ట్. నేను మా ఆయన కోసం ఎంతో ప్రేమగా వంట చేస్తా (Anasuya Cooking). ఆయన మాత్రం అప్పుడప్పుడు నాకోసం చేస్తుంటారు’ అని చెప్పుకొచ్చింది. అంతే.. దీనిని ఎవరికి కావాల్సిన విధంగా వారు హెడ్డింగ్‌లు పెట్టుకుంటూ.. అనసూయ పేరుని ట్రెండ్‌లోకి తీసుకొచ్చేస్తున్నారు. మ్యాటర్ అర్థమయ్యిందిగా.. అది విషయం.


ఇవి కూడా చదవండి:

============================

*Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది

************************************

*L2 Empuraan: ‘లూసిఫర్ 2’కు లైకా కనెక్షన్.. ఈసారి మాములుగా ఉండదట!

************************************

*Vijay Antony: పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. చిన్నకుమార్తెతో కలిసి విజయ్‌ ఆంటోని ఏం చేశాడంటే..

*************************************

Updated Date - 2023-10-02T18:49:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!