Allu Arjun Birthday Special: గ్లోబల్ స్థాయికి దూసుకెళుతోన్న రేసుగుర్రం
ABN, First Publish Date - 2023-04-08T10:50:24+05:30
కంటెంట్ ఉన్నోడే కాదు.. టాలెంట్ ఉన్నోడికి కూడా తిరుగులేదనేలా అల్లు అర్జున్ ప్రస్థానం నడుస్తోంది. అల్లు లెగసీని కంటిన్యూ చేస్తూ..
అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడీ పేరొక సంచలనం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి మురళీ మోహన్ (Murali Mohan) ఓ మాట అన్నారు. అప్పట్లో చిరంజీవి విలన్‌గా ఏవో చిన్న చిన్న పాత్రలు చేస్తాడనుకున్నాం కానీ.. డ్యాన్స్, డైలాగ్స్, నటనలో వైవిధ్యం చూపిస్తూ.. ఇండస్ట్రీకి రంకుమొగుడు అవుతాడని ఊహించలేదని.. మురళీ మోహన్ చెబుతున్న వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇప్పుడు బన్నీ (Bunny) విషయంలో కూడా అదే డైలాగ్ వర్తిస్తుంది. బన్నీ, అల్లు అర్జున్, స్టైలిస్ స్టార్ (Stylish Star), ఐకాన్ స్టార్, గ్లోబల్ స్టార్ (Global Star).. ఇలా రేసుగుర్రం (Race Gurram)లా బన్నీ దూసుకెళుతున్నాడు. 20 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న ఈ దేశముదురు (Desamuduru).. ఎన్నో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశాడు. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి.. అదే సక్సెస్‌కు మార్గం అనుకుంటూ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేసి.. ఇవాళ ఇండస్ట్రీని రూల్ చేసే స్థాయికి చేరుకున్నాడు. ఇవాళ అల్లు అర్జున్ అని వినబడితే చాలు.. గడ్డం కింద చెయ్యి అడ్డంగా కదులుతుందంటే.. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కెరీర్ తొలినాళ్లలో మెగా హీరో (Mega Hero) ట్యాగ్‌తో కంటిన్యూ అయిన ఈ అల్లు హీరో.. ఆ తర్వాత తనంతట తానుగా ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఇవాళ అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్‌ల లెగసీని కంటిన్యూ చేస్తూ.. అల్లు ఆర్మీని సిద్ధం చేసుకున్నాడు. ఈ ఆర్మీ బన్నీ కోసం ఏం చేయడానికైనా వెనుకాడదు. అంత డైహార్డ్ ఫ్యాన్స్ బన్నీకి ఉన్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై ఎవరైనా కామెంట్ చేసినా, కారుకూతలు కూసినా అల్లు ఆర్మీ (Allu Army) చేసే ఎటాక్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఒక్కో సందర్భంలో మెగా ఫ్యాన్స్‌ని కూడా ఈ అల్లు ఆర్మీ ఢీ కొడుతుంటుంది. అలాంటి సైన్యాన్ని అల్లు అర్జున్ సాధించుకున్నాడు. అయితే ఈ స్టార్‌డమ్ బన్నీకి ఈజీగా ఏం రాలేదు. ఆయన కష్టం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ముఖ్యంగా మెగాస్టార్ లెగసీని కంటిన్యూ చేస్తూ.. డ్యాన్స్ విషయంలో బన్నీ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన డ్యాన్స్‌కి ప్రేక్షకులే కాదు.. పక్కనుండే సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయేలా.. తనని తాను మలుచుకున్నాడు. ఇవాళ డ్యాన్స్ విషయంలో ఆయనొక ఐకాన్‌గా మారాడు. ఒక్క డ్యాన్స్ అనే కాదు.. ప్రతి ఫ్రేమ్‌లో తన మార్క్ ప్రదర్శిస్తూ.. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు.. పెంచుతూనే ఉన్నాడు. ఇవన్నీ గమనించాడు కాబట్టే.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఆయనని ‘ఐకాన్ స్టార్’ (Icon Star) ట్యాగ్‌తో సత్కరించాడు.
అల్లు అర్జున్‌కి ఉన్న మరో ప్రధాన ఫ్యాన్ బేస్ మలయాళం (Malayalam)లో ఉంది. గతంలో కానీ, ప్రస్తుతం కానీ.. ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతం. అక్కడ అంతా ఆయనని మల్లు అర్జున్ (Mallu Arjun) అని పిలుస్తారు. ఇక ‘పుష్ప’తో అల్లు అర్జున్ అందరివాడు అయ్యాడు. అంతర్జాతీయ హీరో అయ్యాడు. ఆ సినిమాతో బన్నీ క్రేజ్ ఖండంతరాలను దాటింటి. క్రికెట్, పాలిటిక్స్, బిజినెస్.. ఇలా ఒక్కటేమిటి.. ప్రతి రంగంలోని వ్యక్తులు ఏదో ఒక సందర్భంలో.. ‘నీయవ్వ తగ్గేదే లే’ అని అనేలా.. అల్లు అర్జున్ జనాల్లోకి చొచ్చుకుని వెళ్లిపోయాడంటే.. అది అతని టాలెంట్. కంటెంట్ ఉన్నోడే కాదు.. టాలెంట్ ఉన్నోడికి కూడా తిరుగులేదనేలా అల్లు అర్జున్ ప్రస్థానం నడుస్తోంది. అల్లు లెగసీని కంటిన్యూ చేస్తూ.. ఆ ఫ్యామిలీలో మూడో తరం నటుడిగా చరిత్రను తిరగరాసుకుంటూ వెళుతున్న అల్లు అర్జున్ పుట్టినరోజు (Allu Arjun Birthday) నేడు (ఏప్రిల్ 8). ‘పులి కూడా రెండు అడుగులు వెనక్కి తగ్గిందంటే పుష్పా వచ్చినట్లు’ అంటూ.. ఇండస్ట్రీలో తనదైన ముద్రతో రేసుగుర్రంలా దూసుకెళుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే (#HBDIconStarAlluArjun).
ఇవి కూడా చదవండి:
*********************************
*Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..
*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ మోసం చేశాడా?.. అసలా పోస్టర్‌లో ఉందెవరు?
*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?
*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?
*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!