కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న ఐకాన్ స్టార్

ABN, First Publish Date - 2023-08-26T20:24:52+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు గెలుచుకున్న బన్నీని టాలీవుడ్ ప్రముఖులందరూ సోషల్ మీడియాలోనే కాకుండా ఇంటికెళ్లి మరీ అభినందిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడే, ప్రేమించే తన చికబాబాయ్ (చిరంజీవి) ఆశీస్సులను అందుకున్నారు.

Chiranjeevi and Allu Arjun

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (69th National Film Awards) ఉత్తమ నటుడి (Best Actor)గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి నటుడిగా ఈ అవార్డుతో ఐకాన్ స్టార్ చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచం నలుమూలల నుండి ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘పుష్ప’ (Pushpa) సినిమాలో నటనకిగానూ బన్నీ ఈ అవార్డును గెలుచుకున్నారు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక అవార్డు గెలుచుకున్న బన్నీని టాలీవుడ్ ప్రముఖులందరూ సోషల్ మీడియాలోనే కాకుండా ఇంటికెళ్లి మరీ అభినందిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడే, ప్రేమించే తన చికబాబాయ్ ఆశీస్సులను అందుకున్నారు.


మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఇంటికి వెళ్లి మరీ.. అత్తమామల ఆశీస్సులను బన్నీ తీసుకున్నారు. రీసెంట్‌గా చిరంజీవి కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ శస్త్ర చికిత్స అనంతరం.. శనివారం ఉదయమే ఆయన హైదరాబాద్ వచ్చారు. మెగాస్టార్ హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న బన్నీ.. అవార్డు వచ్చిన ఆనందాన్ని మామయ్యతో షేర్ చేసుకోవడమే కాకుండా.. ఆయన ఆరోగ్య విషయాలను కూడా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood) పరంగా ఏ మంచి జరిగినా సంతోషించే వ్యక్తులలో మెగాస్టార్ చిరంజీవి ప్రథమ స్థానంలో ఉంటారు. రాజమౌళి సినిమాలు, ఆ సినిమాలు తీసుకొస్తున్న కీర్తి విషయంలో చిరంజీవి ఆ మధ్య సుధీర్ఘ ప్రసంగమే ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 7 దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూడబడుతోన్న చోట.. తన మేనల్లుడు చరిత్ర సృష్టించినందుకు చిరంజీవి ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ ఆశీస్సులు అందుకోవడానికి వచ్చిన మేనల్లుడికి సురేఖ, చిరు దంపతులు స్వీట్ తినిపించి, అభినందించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Prakash Raj and Bobby Simha: నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు

*****************************************

*Kartikeya Gummakonda: నేనలా చెప్పగానే.. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు

*****************************************

*Jovika: కుమార్తెను లైన్‌లోకి దించుతోన్న వనితా విజయ్ కుమార్

***************************************

Updated Date - 2023-08-26T20:24:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!