కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Arjun: దర్శకుడు అట్లీ ని ముంబై లో కలిసిన ఐకాన్ స్టార్, సినిమా గురించేనా...

ABN, First Publish Date - 2023-09-23T13:55:03+05:30

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై వెళ్లి అట్లీని కలిసినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే అతను ముంబై ఎయిర్ పోర్టులో వున్నా విడియో కూడా వైరల్ అయింది. తన తదుపరి సినిమా చర్చించడానికే అట్లీని కలిసినట్టుగా ఊహాగానాలు బయలుదేరాయి. అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన రాలేదు.

Allu Arjun and Atlee

షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) నటించిన 'జవాన్' #Jawan ఘన విజయం సాధించటంతో ఆ సినిమాకి దర్శకత్వం వహించిన అట్లీ (Atlee) పేరు ఇప్పుడు మారుమోగుతోంది. అందరూ అతనితో చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే అట్లీ అతన తదుపరి సినిమా అల్లు అర్జున్ (AlluArjun) తో ఉండొచ్చు అని ఊహాగానాలు కూడా వచ్చాయి. 'జవాన్' సినిమా విజయం పట్ల అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే, అందులో అందరికీ శుభాకాంక్షలు చెప్పినప్పుడు, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) సమాధాం చెప్పినప్పుడు, పాటలు అదిరిపోవాలి అని అల్లు అర్జున్ అతనికి మళ్ళీ సమాధానం చెప్పాడు. (IconStar)

ఈ సమాధానంతో అందరూ అట్లీ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉండబోతోందని, దానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అని కూడా ఫిక్స్ అయిపోయారు అర్జున్ అభిమానులు. ఇదిలా ఉండగా ఈరోజు అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు అట్లీని కలిసినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. 'జవాన్' విజయం సందర్భంగా అట్లీకి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెపుతూ, అలాగే తాను చెయ్యబోయే సినిమా గురించి కూడా అట్లీ తో మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ ముంబై ఎయిర్ పోర్ట్ లో వున్న వీడియోస్ అప్పుడే సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి కూడా. కేవలం అట్లీ ని కలవటానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇప్పుడు 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ చేస్తున్నాడు, అది ఆగస్టు 15 న విడుదల అవుతున్నట్టుగా ముందే ప్రకటించారు. దీనికి సుకుమార్ (Sukumar) దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే, అట్లీ తో సినిమా ఉండొచ్చు అని అంటున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు, ఎప్పుడైనా రావొచ్చు అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-09-23T13:55:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!