Agent Twitter Review: అయ్యగారి సినిమా టాక్.. ఏదో తేడాగా ఉందే..?
ABN, First Publish Date - 2023-04-28T09:20:08+05:30
ఏజెంట్ సినిమా ప్రీమియర్స్ ఎర్లీ మార్నింగే పడిపోవడంతో.. ట్విట్టర్ వేదికగా కొందరు ఈ సినిమాపై అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ట్విట్టర్ పరంగా ఈ సినిమాకు రివ్యూస్ ఎలా ఉన్నాయంటే
అఖిల్ అక్కినేని (Akhil Akkineni), సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్‌లో పాన్ ఇండియా (Pan India) స్థాయిలో హై ఆక్టేన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా విజయం అఖిల్ కెరీర్‌కి ఎంతో ముఖ్యం. అందుకే సినిమా ప్రారంభమైన తర్వాత రీ షూట్స్ అంటూ చాలా రకాలుగా ఈ సినిమాపై వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించక, మధ్యలో కరోనా ప్రభావంతో ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు నేడు (ఏప్రిల్ 28) థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్స్ ఎర్లీ మార్నింగే పడిపోవడంతో.. ట్విట్టర్ వేదికగా కొందరు ఈ సినిమాపై అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ట్విట్టర్ పరంగా ఈ సినిమాకు రివ్యూస్ ఎలా ఉన్నాయంటే.. (Agent Twitter Review)
అఖిల్ వన్ మ్యాన్ షో.. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయాయ్. లవ్ స్టోరీ, సాంగ్స్, బీజీఎమ్ మాత్రం వరస్ట్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ మాత్రం కెసిపిడి అంతే.. అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3 స్టార్స్ ఇచ్చాడు.
ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా.. అలాగే ఎమోషన్స్‌ని ఊహించుకుని వెళ్లవద్దు. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం. అఖిల్ అక్కినేని వన్ మ్యాన్ షో ది. మమ్ముట్టి నటన అద్భుతం. నెగిటివ్ ట్రోల్స్ ఆపండిరా బాబు.. నెగిటివ్ ట్రోల్స్ ఆపి.. మూవీని చూసి ఎంజాయ్ చేయండి. (Agent Twitter Talk)
ఇప్పుడే సినిమా పూర్తయింది. ఫస్టాఫ్ చాలా బాగుంది. సినిమా ప్లాట్, వార్నింగ్ సీన్ మరియు ఇంటర్వెల్ సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అఖిల్ నటన చాలా ఇంప్రూవ్ అయింది. సెకండాఫ్ కూడా బాగుంది. కొన్ని ట్విస్ట్‌లు కన్విన్సెంగ్‌గా లాజిక్స్‌కి అందనంతగా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే.. మూవీ అంతా బాగుంది. రామకృష్ణ గోవింద పాటని ఇరికించినట్లుగా అనిపించింది. ఐటమ్ సాంగ్ ఓకే. హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. (Agent Twitter Report)
ఫస్టాఫ్: మినిస్టర్ వార్నింగ్ సీన్ తప్ప మిగతా అంతా అంత గొప్పగా లేదు. సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా బాలేదు. అఖిల్ అక్కినేని మాత్రం ది బెస్ట్ ఇచ్చిపడేశాడు.
ఏజెంట్ సినిమా రెగ్యులర్ ప్లాట్‌తోనే కొన్ని గజిబిజి సీన్లతో మొదలైంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. బిజీఎమ్ చాలా బాగుంది. అఖిల్ తన పాత్రను అద్భుతంగా చేశారు. చాలా వరకు సినిమా రొటీన్‌గానే నడిచింది. సెకండాఫే ఈ సినిమా ఏమైనా కాపాడాలి.. అంటూ నెటిజన్లు ‘ఏజెంట్’ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా అయితే నెటిజన్ల అభిప్రాయం ప్రకారం ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ మాత్రమే వినిపిస్తుంది. అసలు సినిమా ఎలా ఉందీ అనేది కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం. (Agent Twitter Review)
ఇవి కూడా చదవండి:
************************************************
*Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది
*Bholaa Shankar: రెండు కీలక అప్‌డేట్స్‌తో వచ్చిన మెగాస్టార్
*Sekhar Kammula: శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్ ఇదేనట..
*Thangar Bachan: తమిళ తెరకు మరో నందితా దాస్‌ను పరిచయం చేస్తున్నా..
*Kundavai: యువరాణి కుందవై ఇతర పేర్లు ఏంటి?
*Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..
* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..
*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?