Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..
ABN, First Publish Date - 2023-05-12T23:27:23+05:30
తననెవరూ పట్టించుకోవడం లేదని అనుకున్నాడో.. లేదంటే తను చేయాల్సిన సినిమా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వారు చేస్తున్నారని బాధతో చేశాడో తెలియదు కానీ.. మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నా నంటూ..
నటుడు, నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి మాట తప్పబోతున్నాడు. రీసెంట్‌గా తనకూ, రాజకీయాలకు సెలవు అన్నట్లుగా పలు ఇంటర్వ్యూలలో కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.. తాజాగా ట్విట్టర్ వేదికగా వరస ట్వీట్స్‌తో రాజకీయ బాంబు పేల్చాడు. నిఖారైన రాజకీయాలు చేస్తా.. వస్తా రాజకీయాలలోకి అన్నట్లుగా వరస ట్వీట్స్‌తో మోత మోగించాడు. వాస్తవానికి బండ్ల గణేష్‌కు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో ఇష్టం. ఆ విషయం ఆయన పలు సందర్భాలలో ప్రకటించారు. ఈ మధ్య కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Gandhi Bharath Jodo Yatra) సమయంలో కాంగ్రెస్ (Congress) సపోర్ట్ చేస్తూ కొన్ని ట్వీట్స్ వేశాడు. మళ్లీ కామ్ అయిపోయిన బండ్ల గణేష్.. తననెవరూ పట్టించుకోవడం లేదని అనుకున్నాడో.. లేదంటే తను చేయాల్సిన సినిమా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వారు చేస్తున్నారని బాధతో చేశాడో తెలియదు కానీ.. మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నా నంటూ.. ఇన్ డైరెక్ట్‌గా పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ని టార్గెట్ చేసినట్లుగా కొన్ని ట్వీట్స్ పేల్చాడు. అందులో..
‘‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం. నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి.. అందుకే వస్తా.’’ అంటూ బండ్ల చెప్పుకొచ్చాడు. (Bandla Ganesh Tweets)
అయితే బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు (Netizens) కూడా చాలా ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. సేమ్ టు సేమ్ బండ్ల గణేష్ ట్వీట్స్ తరహాలోనే.. ‘‘రాజకీయం అంటే దోచుకోవడం, రాజకీయం అంటే రౌడీయిజం, రాజకీయం అంటే గుండాయిజం, రాజకీయం అంటే మాట తప్పడం, రాజకీయాలు అంటే ఒక వ్యాపారం’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘ఎవడు చెప్పడన్నా.. రాజకీయాలు అంటే నీతి నిజాయితీ అని.. అది ఒకప్పుడు ఇప్పుడు కాదు’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక వివిధ పార్టీలకు చెందని అభిమానులు మా పార్టీలోకి రా అన్నా.. అంటే మా పార్టీలోకి రా.. అంటూ బండ్లకు ఆహ్వానం పలుకుతున్నారు. మొత్తంగా అయితే.. బండ్ల గణేష్ చేసిన ఈ పొలిటికల్ ట్వీట్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చలు మొదలయ్యాయి. మరి బండ్ల ఏ పార్టీలోకి చేరతాడో.. లేదంటే కొత్తగా పార్టీనే పెడతాడో.. చూడాల్సి ఉంది.
ఇవి చదవండి:
************************************************
*SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?
*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
*Anandhi: ‘కయల్’ ఆనంది డబుల్ ధమకా
*Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!
*Shaakuntalam: చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసింది
*Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే! నా బయోపిక్ కాదు
*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి
*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది