Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!
ABN, First Publish Date - 2023-06-15T17:26:16+05:30
రీసెంట్గా యాంకర్ కమ్ నటి అనసూయ తన పెళ్లి రోజును పురస్కరించుకుని బీచ్‌లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అనసూయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అనసూయ తన భర్త సహాయంతో మామిడికాయలను కోస్తోంది. తన భర్త రెండు చేతులతో అనసూయను ఎత్తి పట్టుకుని.. కాయలు కోయిస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గా యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya) తన పెళ్లిరోజును పురస్కరించుకుని ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వేసింది. ఆ సమయంలో బీచ్‌లో అనసూయ సృష్టించిన అలజడికి కుర్రాళ్ల గుండెల్లో సునామీలు వచ్చేశాయి. కురచ దుస్తులు అనసూయ వేసుకోవడం కొత్త విషయం ఏమీ కాదు.. జబర్ధస్త్‌లో చేసేటప్పుడు, ఆ తర్వాత చేసిన కొన్ని ఫొటో షూట్స్‌లో అనసూయ హాట్ హాట్‌గా కనిపించి అందరినీ కవ్వించేది. కానీ, పెళ్లి రోజు సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాని హీటెక్కించాయి. అస్సలు గ్యాప్ అనేది ఇవ్వకుండా.. నాలుగైదు రోజుల పాటు వరసబెట్టి బీచ్‌లో తన భర్తతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను, ఫొటోలను అనసూయ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూనే వచ్చింది. ఆ తర్వాత మళ్లీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయింది.
తను నటించిన ‘విమానం’ (Vimanam) సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనసూయ.. వాటిలో సైతం ఏదో ఒక హాట్ టాపిక్ మాట్లాడి.. వార్తలలో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో ఇకపై ఎట్టిపరిస్థితులలోనూ రియాక్ట్ కానని తెలిపింది. కాకపోతే.. విజయ్ దేవరకొండ సన్నిహితులైన కొందరు.. డబ్బులిచ్చి మరీ తనని తిట్టించారని తెలిసి చాలా బాధపడినట్లుగా.. ఆమె చేసిన ఆరోపణలు మరోసారి ఇండస్ట్రీలో హీట్‌ని పెంచాయి. అయితే దానిని పెద్ద ఇష్యూ చేయడం ఇష్టం లేక.. అనసూయ కామ్‌గానే వదిలేసింది. అనసూయ ఆరోపణలపై కనుక విజయ్ రియాక్ట్ అయి ఉంటే మాత్రం.. మళ్లీ ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణం నెలకొనేదేమో కానీ.. విజయ్ కూడా పట్టించుకోకుండా కామ్‌గానే ఉన్నారు. దీంతో ఆ విషయం అంతటితో సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు.. మరోసారి ఆమెను వార్తలలో హైలెట్ అయ్యేలా చేస్తున్నాయి.
ఇంతకీ ఆ ఫొటోలలో ఏముందని అనుకుంటున్నారా? మొన్న బీచ్‌లో భర్తతో కలిసి ఆటాడుకున్న అనసూయ.. ఈసారి భర్త సహాయంతో మామిడితోటలో మామిడికాయలను కోసేందుకు ప్రయత్నిస్తోంది. తన భర్త రెండు చేతులతో ఎత్తి పట్టుకోగా.. చెట్టుకున్న మామిడికాయలను (Mangoes) ఆమె కోస్తోంది. ‘నిన్న కొన్ని మంకీస్ తోటలో ఇలా’.. అంటూ ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలలో.. అనసూయ కనిపించిన తీరు, అలాగే ఆమె భర్త ఆమెతో కాయలు కోయిస్తున్న తీరు.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు ‘కాయలు కోస్తున్నట్లు లేదు.. నువ్వు మా హృదయాలను కోసేస్తున్నట్లు ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. దీంతో అనసూయ పోస్ట్ (Anasuya Social Media Post) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
**************************************
*SJ Suryah: అమితాబ్ బచ్చన్ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..
**************************************
*Urvashi: విలేకరులారా.. తప్పకుండా ఆ ప్రశ్న అడగండి
**************************************
*Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..
**************************************
*Mahi V Raghav: ‘సైతాన్’ వెబ్ సిరీస్‌పై మరోసారి హెచ్చరిక చేసిన దర్శకుడు
**************************************