Adipurush: దళితులకు ప్రవేశం లేదు.. ఫేక్ పోస్టర్ హల్‌చల్.. స్పందించిన మూవీ టీమ్
ABN, First Publish Date - 2023-06-07T18:52:38+05:30
‘ఆదిపురుష్’ టీమ్ విడుదల చేసిన హనుమాన్ కోసం ఒక సీట్ ఖాళీగా ఉంచుతున్నాం అనే పోస్టర్‌ని కొందరు ఆకతాయిలు ఫేక్ చేసి పడేశారు. ఆ స్థానంలో ఈ సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదంటూ.. సేమ్ టు సేమ్ ఫాంట్‌తో రాసి సోషల్ మీడియాలో వదలారు. ఇది తెలుసుకున్న టీమ్ వెంటనే రియాక్ట్ అయి.. ఆ పోస్టర్‌ని ఖండించింది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas) శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). కృతీసనన్, సైఫ్ అలీఖాన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో భూషణ్‌కుమార్ నిర్మించారు. ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒక్కసారిగా సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫేక్ పోస్టర్ (Fake Poster) వైరల్ అవడంతో.. చిత్రయూనిట్ అప్రమత్తమైంది.
ఇంతకు ముందు మేకర్స్ ఆదిపురుష్ ప్రదర్శించబడే థియేటర్లలో ఓ ఖాళీ సీటును ఉంచడం జరుగుతుందని, అది హనుమాన్ (Lord Hanuman) కోసమని తెలుపుతూ ఓ పోస్టర్‌ని విడుదల చేయగా.. ఆ పోస్టర్‌పై ఉన్న లెటర్స్ స్థానంలో.. ఫేక్ రాయుళ్లు ‘దళితులకు ప్రవేశం లేదు’ అంటూ రాసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఆ పోస్టర్ నిజమే అనుకుని.. ‘ఆదిపురుష్’ టీమ్ (Adipurush Team) ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి అనేలా నెటిజన్ల నుంచి కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఒక్క నిమిషం చూస్తే.. నిజంగానే ఆ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారేమో అనేలా.. ఫాంట్‌ని కూడా సేమ్ టు సేమ్ దించేశారు. (Adipurush Fake Poster)
‘‘రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ.. ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ధర్మం కోసం నిర్మించిన ‘ఆదిపురుష్’ని హిందువులందరూ తప్పక వీక్షిద్దాం’’ అని ఫేక్ రాయుళ్లు వదలిన పోస్టర్‌లో ఉంది. ఈ పోస్టర్ మేకర్స్ వరకు చేరడంతో.. వెంటనే రియాక్ట్ అవడమే కాకుండా.. అది నిజంకాదని మేకర్స్ ఖండించారు. ఈ పోస్టర్, అందులోని మ్యాటర్ నిజం కాదని తెలుపుతూ.. ‘ఆదిపురుష్’ చిత్రం భారతీయులందరి సినిమా. ‘ఆదిపురుష్’ టీమ్‌కు, సినిమాకు కుల, వర్ణ లేదా మతం అనే ఎలాంటి వివక్ష లేదు. ఈ సినిమా సమానత్వాన్ని బలపరిచేందుకు తెరకెక్కిన చిత్రమని తెలియజేశారు. దయచేసి ఆ ఫేక్ పోస్టర్‌ని, అందులోని మ్యాటర్‌ని ఎవరూ పట్టించుకోవద్దని ‘ఆదిపురుష్’ యూనిట్ కోరింది.
ఇవి కూడా చదవండి:
************************************************
*Gandheevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది
*Custody: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కస్టడీ’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
*Adipurush: తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గులు, ముద్దులపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..?
*Prabhas: పెళ్లి ప్రస్తావన.. ప్రభాస్ ఇచ్చిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్!
*Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం