Women power: పార్లమెంట్ భవనంలో నటీమణుల సందడి, ఫోటో వైరల్
ABN, First Publish Date - 2023-09-21T15:26:36+05:30
వివిధ భాషల కి చెందిన చిత్ర పరిశ్రమ నుండి కొంతమంది నటీమణులకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి పిలుపు వచ్చింది, ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఆ నటీమణులు సమావేశం అయ్యారు, వారందరూ కలిసి వున్న ఫోటో వైరల్ ఇప్పుడు అవుతోంది.
కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో #IndianParliament చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన మహిళా బిల్లును WomenReservationBill2023 పార్లమెంట్ ఆమోదించటంతో సర్వత్రా హర్షం నెలకొంది. ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (NarendraModi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఒకే చెపితే, కొత్త పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. ఇది ఒక మంచి శుభపరిణామం అని అందరూ కొనియాడారు. అన్ని పార్టీల మహిళలు ఈ బిల్లు ఆమోదించటం మీద హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం నుండి కొంతమంది నటీమణులకు ఢిల్లీ కి రావలసిందిగా ఆహ్వానాలు అందాయి. అందులో తెలుగు నుండి మంచు లక్ష్మి (ManchuLakshmi), అలాగే తమన్నా భాటియా (TamannaahBhatia), ఖుష్బూ (Khushbu) ఇంకా మిగతా పరిశ్రమల నుండి కూడా చాలామంది నటీమణులు వచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం లో వీరందరూ కలిపి ఒక ఫోటో కూడా తీసుకున్నారు. ఈ ఫోటోని ఖుష్బూ తన సాంఘీక మాధ్యమం అయిన ట్విట్టర్ లో షేర్ చేశారు.
దానికి కేప్షన్ విమెన్ ఎన్పవర్మెంట్, విమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023, న్యూ ఢిల్లీ అని ఇచ్చారు. వీళ్లందరినీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందినందుకు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి పిలిపించారని, వీరితో ఆ బిల్ విషయం మాట్లాడవచ్చు అని తెలిసింది.