భర్తతో హీరోయిన్ షీలా తెగదెంపులు
ABN, First Publish Date - 2023-12-03T20:24:44+05:30
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దిగుమతి అయిన హీరోయిన్లలో షీలా రాజ్‌కుమార్ ఒకరు. తన వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్టు ఆమె శనివారం తన ట్విట్టర్ అకౌంట్‌లో ప్రకటించి, తన భర్తకు ట్యాగ్ చేశారు.
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దిగుమతి అయిన హీరోయిన్లలో షీలా రాజ్‌కుమార్ (Sheela Rajkumar) ఒకరు. తన వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్టు ఆమె శనివారం తన ట్విట్టర్ అకౌంట్‌లో ప్రకటించి, తన భర్తకు ట్యాగ్ చేశారు. తమిళంలో ‘టూ లెట్’, ‘ద్రౌపది’, ‘మండేలా’, ‘పిచ్చైకారన్-2’, ‘నూడుల్స్’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరుతో పాటు గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ చోళన్ (Chozhan)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, తన వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించారు. (Sheela Rajkumar to Get Divorced)
‘వైవాహిక బంధం నుంచి నేను వైదొలుగుతున్నాను. కృతజ్ఞతలు. ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేసి భర్తకు ట్యాగ్ చేశారు. కాగా, మంచి కథా చిత్రాలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్న షీలా... వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘జిగర్‌తండ డబుల్ ఎక్స్’ (Jigarthanda Double X)లో కూడా ఎస్‌జే సూర్య (SJ Suryah) ప్రియురాలిగా నటించారు. ఇదిలా ఉండగా పెళ్లి బంధం అనేది సినీ నటీనటులకు మూడునాళ్ల ముచ్చటగా మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*‘బై వన్ టికెట్.. గెట్ వన్ ఫ్రీ’.. నిర్మాత బంపరాఫర్
*****************************************
*Charan Arjun: రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది
***********************************
*Anasuya: ఓటమిని ఒప్పుకున్న కేటీఆర్.. ప్రేమలో పడ్డానంటూ అనసూయ ట్వీట్
***********************************