సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Actress Prema: రెండో పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రేమ..!

ABN, First Publish Date - 2023-04-15T17:04:38+05:30

సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌పై ప్రేమ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ (Prema about Second Marriage) ఇచ్చారు.

Actress Prema
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పటి కథానాయిక ప్రేమ (Prema) పేరు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం ‘దేవి’ (Devi). ఆమె కన్నడ నటి అయినా.. తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995 నుంచి 2005 వరకూ తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ప్రేమ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2017లో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె అనుకున్నంతగా సక్సెస్ అయితే కాలేదు. ఈ నేపధ్యంలో ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి రూమర్స్‌పై ప్రేమ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ (Prema about Second Marriage) ఇచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో పర్సనల్ లైఫ్ వేరు.. ప్రొఫెషనల్ లైఫ్ వేరు. నా పర్సనల్ లైఫ్‌లోకి నేనెప్పుడూ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకు రాలేదు. నా పెళ్లి, విడాకుల గురించి ఇప్పటి వరకు నన్నెవరూ అడగలేదు. నాకు నచ్చలేదు అంటే స్ట్రయిట్‌గా డెసిషన్ తీసుకుంటా. ఇది నా జీవితం. నాకు మాత్రమే చెందిన జీవితం. నా లైఫ్‌కి ఉన్న ఇబ్బందుల గురించి నా పేరెంట్స్‌తో మాట్లాడాను. వారు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేశారు. అది చాలు నేను నిర్ణయం తీసుకోవడానికి. ఇలాంటి విషయాల్లో కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికీ నేను చెబుతుంటాను. సూసైడ్ చేసుకోవద్దు.. ఛాలెంజ్‌గా తీసుకోమని చెబుతాను. నేను అలానే తీసుకున్నాను. (Actress Prema Latest Interview)

మనుషులన్నాక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రపంచం చాలా పెద్దది. ఏదో ఒక పని చేస్తే.. డైవర్ట్ అయిపోవచ్చు. పెళ్లి (Marriage) అనేదే జీవితం కాదు. ఇంకా వేరే జీవితం చాలా ఉంది. నీకు అన్ని శక్తులు ఉన్నాయి.. ఛాలెంజ్‌ (Challenge)గా తీసుకుంటే చాలు.. స్ట్రాంగ్ అవుతారు. ఇక రెండో పెళ్లి (Second Marriage) అంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏమీ తెలియకుండా అలా ఎలా రాస్తారో నాకయితే తెలియదు. ప్రస్తుతం నేను బెంగళూరులో ఒంటరిగానే ఉంటూ.. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఈ విషయంలో ఎలాంటి రూమర్స్ నమ్మవద్దు. నాకు పిల్లలు లేరు (No Children). నాకు నా పెట్ డాగ్సే పిల్లలు..’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

*Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ

*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

Updated Date - 2023-04-15T17:04:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!