Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?
ABN, First Publish Date - 2023-03-21T18:42:35+05:30
ఒక్కోసారి సోషల్ మీడియా (Social Media)లోని కొందరు వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. వారి అత్యుత్సాహానికి కొందరు అమాయకులు, సెలబ్రిటీలు బలవుతుంటారు. అసలు విషయం ఏమిటనేది తెలుసుకోకుండానే..
ఒక్కోసారి సోషల్ మీడియా (Social Media)లోని కొందరు వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. వారి అత్యుత్సాహానికి కొందరు అమాయకులు, సెలబ్రిటీలు బలవుతుంటారు. అసలు విషయం ఏమిటనేది తెలుసుకోకుండానే.. సమాజంలో పేరున్న వారిపై అనుచిత వార్తలను పోస్ట్ చేస్తుంటారు. మంగళవారం ఉదయం కూడా సోషల్ మీడియాలో ఇదే జరిగింది. సీనియర్ అండ్ విలక్షణ నటుడైన కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)పై అసత్య ప్రచారం చేశారు. ఆయన ఇక లేడంటూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ వరల్డ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. దౌర్భాగ్యం ఏమిటంటే.. ఇది అసత్య ప్రచారం అని చెప్పడానికి స్వయంగా కోట శ్రీనివాసరావే వివరణ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేయాల్సి రావడం. ‘‘నేను క్షేమంగా ఉన్నారా బాబు.. డబ్బు సంపాదించుకోవడానికి సమాజంలో చెడ్డ పనులు చాలా ఉన్నాయి. మంచిగా ఉన్న మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు..’’ అంటూ.. కోట (Kota) ఈ వీడియోలో పేర్కొన్నారు.
కోట శ్రీనివాసరావుతో పాటు.. తనపై, తన భర్తపై చేస్తున్న అసత్య ప్రచారానికి నటి హేమ (Actress Hema) ఫైరయింది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ మరీ శృతి మించి ప్రవర్తిస్తున్నాయని, వాటికి తగ్గట్టే ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) కూడా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిక్షేపంలా ఉన్న సెలబ్రిటీలను చనిపోయారంటూ అసత్య ప్రచారం చేయడంతో పాటు.. తన భర్తతో ఉన్న ఫొటోలకు ఫేక్ థంబ్‌నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ.. ఆమె సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. సెలెబ్రిటీలను (Celebrities) టార్గెట్ చేస్తూ.. అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానెల్స్, వెబ్ సైట్స్, సోషల్ మీడియాలోని వ్యక్తులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని నటి హేమ.. మంగళవారం బషీర్ బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) ఫిర్యాదు చేసింది. కోట శ్రీనివాసరావు మృతి అని సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసిన వారిని.. సోషల్ మీడియా వేదికగా వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె కోరింది. (Character Artist Hema)
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం హేమ మాట్లాడుతూ.. ‘‘వెబ్ మీడియాలో రాసే రాతల్లో కంటెంట్ వేరు ఉంటుంది.. థంబ్‌నైల్స్ మరొకలా ఉంటున్నాయి. మా పెళ్లి ఫోటోలను సేకరించి కొందరు వెబ్ వాళ్లు తప్పుడు వార్తల రాస్తున్నారు. తప్పుడు థంబ్‌నైల్స్ వల్ల మా క్యారెక్టర్స్ బ్యాడ్ కావడంతో పాటు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇదే కాకుండా నేడు (మంగళవారం) కోట శ్రీనివాసరావు చనిపోయారు అని తప్పుడు రాతలు రాశారు. చివరికి తాను బతికే ఉన్నానని కోట గారు వీడియో చేయాల్సి వచ్చింది. గతంలో చాలామంది సెలబ్రిటీల పైన ఇలాంటి అసభ్యకర, ఇబ్బందికర రాతలు రాశారు. ఇలాంటి రాతల వల్ల మా కుటుంబ పరువు, మర్యాదలు దెబ్బతింటున్నాయి.. ఇది సరైన పద్ధతి కాదు. కొంతమంది హీరోలు తమ భార్యలతో డైవర్స్ తీసుకుంటున్నారు అని రాస్తున్నారు. హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్న వాళ్లు కూడా డైవర్స్ తీసుకుంటున్నారని రాస్తున్నారు. చాలామంది థంబ్‌నైల్స్ మాత్రమే చూస్తున్నారు.. కంటెంట్ చూడట్లేదు. దీంతో మా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఈ అంశాలపై సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశాను. చాలామంది దొరకము అనే ధీమాతో ఇలాంటివి చేస్తున్నారు. గతంలో మార్ఫింగ్ వీడియో చేసిన ఒక వ్యక్తి యూఎస్ నుండి పారిపోయి దుబాయ్‌లో దాక్కున్నా.. అక్కడి నుంచి పట్టుకొచ్చారు. గతంలో నేను వెబ్ మీడియా మీద ఫైట్ చేశాను.. ఇప్పుడు కూడా అదే మీడియా పైన ఫైట్ చేయబోతున్నాను. నాతో పాటు నా కో-ఆర్టిస్టులపై కూడా ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారు. మరొకసారి నా గురించిగానీ.. నా ఫ్యామిలీ గురించి గానీ తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళ అంతు చూస్తా..’’ అని హేమ ఫైరయ్యారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?
*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్
* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు
*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది
*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్
*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది