Chandrayaan 3: ప్రకాష్ రాజ్, ఇదేంపని, చివరికి అందరినీ ద్వేషిస్తావు, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్...
ABN, First Publish Date - 2023-08-21T19:43:43+05:30
నటుడు ప్రకాష్ రాజ్ కి ఎప్పుడూ వార్తల్లో ఉండటం సరదాగా ఉన్నట్టుండి. ప్రతి సారీ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ తన సాంఘీక మాధ్యమంలో ఎదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటే ప్రకాష్ రాజ్, ఈసారి ఏకంగా దేశానికి సంబందించిన ఒక ఘనకార్యం గురించి ఏమన్నాడో తెలిస్తే షాకవుతారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (PrakashRaj) మరోసారి వార్తల్లో వున్నాడు. ఈసారి ఒక పార్టీ మీదో, వ్యక్తి మీదో చేసిన విమర్శా కాదు. ఇస్రో (ISRO) సంస్థ ప్రయోగించిన చంద్రయాన్ 3 (Chandrayaan3) గురించి పెట్టిన ఒక కార్టూను. అది కూడా బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి ఒక వ్యంగ కార్టూన్ పోస్ట్ చేసాడు ప్రకాష్ రాజ్. అయితే మొదటి నుండి, బీజేపీ (BJP) ని, ప్రధానమంత్రి మోడీని (PrimeMinisterModi) బాగా విమర్శిస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్, ఈసారి ఇస్రో లాంటి సంస్థ చంద్రుడు (Moon) మీదకి ప్రయోగించిన చంద్రయాన్ లాంటి దాని మీద కూడా విమర్శ ఏంటి అని నెటిజన్స్ ప్రకాష్ రాజ్ ని ట్రోల్ చేస్తున్నారు. (Prakash Raj trolled heavily for his comment on Chandrayaan 3)
ఇంతకీ విషయం ఏంటి ఆంటీ, ఇస్రో సంస్థ తన సాంఘీక మాధ్యమంలో చంద్రయాన్ 3 పంపిన ఫోటోస్ ని షేర్ చేసింది. చంద్రుడి మీద ఎక్కడ సరిగ్గా ల్యాండ్ అయితే బాగుంటుంది అనే విషయంలో చంద్రయాన్ పంపిన ఫోటోస్ ని ఇస్రో సంస్థ పెడితే దానికి ప్రకాష్ రాజ్ ఒక వింతైన పోస్ట్ పెట్టాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక వ్యక్తి లుంగీ కట్టుకొని, కాఫీ కలుపుతూ (అదే పైనుండి కిందది కాఫీ కలుపుతారు కదా ఆలా వున్న పోజ్) వున్న ఫోటో పెట్టి, చంద్రుడి నుండి విక్రమ్ లాండర్ పంపిన మొదటి చిత్రం వచ్చింది అంటూ పోస్ట్ పెట్టాడు ప్రకాష్ రాజ్.
ఇది నెటిజన్స్ కి బాగా కోపం తెప్పించింది. ఇంకేమి ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు. ఇస్రో లాంటి సంస్థ పార్టీ కి చెందింది కాదని, ఒకవేళ చంద్రయాన్ 3 చంద్రుడి మీద సరిగ్గా ల్యాండ్ అయితే అది దేశం ఎక్క ఘన విజయం అంటూ చెప్పుకొచ్చారు. అది ఏ పార్టీ ఘనత కాదని, చివరికి ప్రకాష్ రాజ్ అందరినీ ద్వేషించే పరిస్థితి వస్తుందని కూడా కొందరు చెప్పారు. స్టాండ్ అప్ కమెడియన్ అపూర్వ గుప్త (AppurvGupta) అయితే ప్రకాష్ రాజ్ ని ఒక మంచి టాలెంట్ నటుడువి అయ్యుండి ఇలా ప్రవర్తించటం బాగోలేదు అన్నాడు. "ద్వేషంతో అసలు చిక్కు ఏంటంటే, నువ్వు ఒక మనిషి మీద ద్వేషం పెంచుకుంటే చివరికి నువ్వు అందరి మీద ద్వేషం పెంచుకుంటావు. నువ్వు అప్పుడు మనిషికి, భావజాలానికి, దేశంచేసే ఘనకార్యం వీటన్నిటి మధ్య తేడా తెలుసుకోలేక పోతావు, అన్నీ ఒకేలా కనపడతాయి," అని చెప్పాడు అప్పోర్వ గుప్త.