కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Aishwarya Rai: ఐష్ టాయిలెట్స్ కడగడానికి కూడా ఆ క్రికెటర్ పనికిరాడంటూ.. నెటిజన్లు ఫైర్

ABN, First Publish Date - 2023-11-15T11:34:37+05:30

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. పాకిస్థాన్ అంటేనే మండిపడే భారత్ జనాలు.. ఇప్పుడు పాక్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలతో వారెంత సంస్కార హీనులో మరోసారి వెల్లడైందంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.

Aishwarya Rai

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai)ని ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ (Abdul Razzaq) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. పాకిస్థాన్ అంటేనే మండిపడే భారత్ జనాలు.. ఇప్పుడు పాక్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలతో వారెంత సంస్కార హీనులో మరోసారి వెల్లడైందంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అసలింతకీ ఏం జరిగిందంటే..

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023లో (WC 2023) పాకిస్థాన్ టీమ్ దారుణంగా విఫలమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు అంతా ఒక్కచోటకు చేరి విమర్శలు గుప్పించారు. బాబర్ ఆజామ్ (Babar Azam) చెత్త కెప్టెన్సీతోనే పాక్‌కు ఘోర పరాజయం ఎదురైందని, ఇందులో క్రికెట్ బోర్డు(పీసీబీ) తప్పిదం కూడా ఉందని దుమ్మెత్తిపోశారు. కరాచీలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో మాజీ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సల్మాన్ బట్, అబ్దుల్ రజాక్‌ వంటి వారంతా పాల్గొన్ని పీసీబీపై విమర్శలు గుప్పించారు. (#AishwaryaRaiBachchan)


ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. (Abdul Razzaq Comments on Aishwarya Rai) ‘‘నేను జట్టుకు ఆడే సమయంలో యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతను జట్టును అత్యుత్తమంగా నడిపేవాడు. ఆటగాళ్లకు అండగా ఉంటూ స్పూర్తిని కలిగించేవాడు. అతని మాటలు నన్నే కాదు టీమ్ మొత్తాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవి. అతను ఇచ్చే స్ఫూర్తితో జట్టు కోసం నేను సాధ్యమైనంత చేయగలిగాను. కానీ ఇప్పుడు పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. క్రికెట్‌ను మెరుగుపర్చాలని పాక్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి? నేను ఐశ్వర్య రాయ్‌ (#AishwaryaRai)ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే జరుగుతుందా?. ఇది కూడా అంతే. ఏదైనా సంకల్పం బలంగా ఉంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి’’ అనేలా మాట్లాడాడు.


అయితే పాక్ క్రికెట్ బోర్డు (PCB), ఆటగాళ్ల గురించి అబ్దుల్ రజాక్ ఎంతగా విమర్శించినా ఏం అయ్యేది కాదు కానీ.. ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు విమర్శలకు కారణం అవుతున్నాయి. అబ్దుల్ రజాక్ మాటలకు భారత్ నెటిజన్లు.. ‘ఐశ్వర్యరాయ్ టాయిలెట్స్ కడగడానికి కూడా పనికిరావ్.. నోరు అదుపులో పెట్టుకో.. ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా?’ అంటూ రజాక్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అయితే రజాక్‌తో పాటు ఈ చర్చలో పాల్గొన్న ఇతర క్రికెటర్స్ అందరూ.. ఈ వ్యాఖ్యలను ఖండించడంతో.. అబ్దుల్ రజాక్ క్షమాపణలు కోరాడు. పాక్‌కు చెందిన సమా టీవీ వేదికగా.. ‘‘క్రికెట్ కోచింగ్, ఉద్దేశాలకు సంబంధించి నేనొక సమావేశంలో చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు కోరుతున్నాను. ఐశ్వర్యరాయ్ విషయంలో టంగ్ స్లిప్ (Slip Of Tongue) అయ్యాను. అందుకు ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు (Apology) చెబుతున్నాను. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాత్రం ఆ వ్యాఖ్యలు చేయలేదని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను’’ అని అబ్దుల్ రజాక్ చెప్పుకొచ్చాడు. అయినా కూడా అతనిపై ఆగ్రహ జ్వాలలు మాత్రం ఆగడం లేదు.


ఇవి కూడా చదవండి:

========================

*Radha Madhavam: వినాయక్ హీరోగా ‘రాధా మాధవం’.. ఫస్ట్ లుక్ విడుదల

*********************************

*Roti Kapda Romance: యూత్‌ని ఆకర్షించేలా ‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ లుక్

*****************************

*Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. ‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!

*****************************

Updated Date - 2023-11-15T12:43:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!