Salaar: 'సలార్' రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Dec 18 , 2023 | 04:59 PM

ప్రభాస్, ప్రిథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'సలార్' రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. శృతి హాసన్ ఇందులో కథానాయిక, శ్రీయా రెడ్డి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు ఇంకో ముఖ్య పాత్రలో కనపడనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 22న విడుదలవుతోంది. ఈ సినిమా కోసమని ప్రభాస్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. 'కెజీఎఫ్' నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ 'సలార్' సినిమాకి కూడా నిర్మాతలు. ఇది రెండు పార్టులుగా విడుదల కానుంది, అందులో మొదటిది ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ అనేది మొదటి పార్టు. ఈ ట్రైలర్ చూస్తే, ఇద్దరు పిల్లల మధ్య స్నేహం, వారిద్దరూ పెరిగి పెద్దయిన తర్వాత కాన్సార్ ప్రాంతానికి రాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) కావాలనుకున్న వాడిపై శత్రువులు దాడి చేస్తే తన స్నేహితుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసే మరో స్నేహితుడు దేవా (ప్రభాస్) కథే 'సలార్ సీజ్ ఫైర్' అని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న అంచనాలు రిలీజ్ ట్రైలర్‌తో మరింత పీక్స్‌కి చేరుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

Theatrical movies : ఈ వారం థియేటర్‌లో సందడి ఈ చిత్రాలదే!

Updated at - Dec 18 , 2023 | 05:14 PM