SSRajamouli: సామాన్య ప్రేక్షకుడిలా...
ABN, First Publish Date - 2023-07-11T12:03:43+05:30
ఒక్క తెలుగులోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా అతనికి జేజేలు పలికింది. తన సినిమా 'ఆర్ఆర్ఆర్' ని ఆస్కార్ వరకు తీసుకెళ్లడమే కాదు, అవార్డు కూడా తీసుకున్నాడు. అటువంటి దర్శక దిగ్గజం అయిన రాజమౌళి ఒక సామాన్య ప్రేక్షకుడిలా సినిమా థియేటర్ కి వచ్చి చూస్తాడు....
ఇప్పుడు ప్రపంచంలో పేరెన్నికగన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SSRajamouli). రామ్ చరణ్ (RamCharan), ఎన్టీఆర్ (NTR) నటించిన 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాని ఆస్కార్ (OscarAward) వరకు తీసుకెళ్లిన రాజమౌళి, అవార్డు కూడా గెలుచుకుంది. ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన రాజమౌళి నిజ జీవితంలో మాత్రం అతి సామాన్యంగా, సింపుల్ గా ఉంటాడు. మామూలుగా ఒకటి రెండు సినిమాలు చేస్తే చాలు, టాలీవుడ్ లో బౌన్సర్ల ను పెట్టుకొని, కిందా మీదా చూడకుండా, పట్టించుకోకుండా, ఎగెరెగిరి పడేవాళ్ళను చాలామందిని చూసాం. కానీ ప్రపంచ స్థాయిలో ఎంతో పేరుతెచ్చుకున్న రాజమౌళి ఒక సామాన్య ప్రేక్షకుడిలా ఒక సినిమాకి ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా వచ్చారు అంటే, తను ఎంత సామాన్యంగా ఉంటాడో చూడండి.
గత వారం 'భాగ్ సాలె' #BhaagSaale అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో శ్రీసింహ కోడూరి (SriSimhaKoduri) కథానాయకుడు, అతను రాజమౌళి అన్నయ్య కీరవాణి (MMKeeravani) రెండో కుమారుడు. ఈ సినిమా విడుదల అయినప్పుడు మొదటి రోజు మొదటి షోకి రాజమౌళి, కీరవాణి ఇలా మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఆ సినిమాకి వచ్చి సింహ కోడూరి కి తమ సపోర్ట్ చాటారు.
వీరందిరితో పాటు నిర్మాత కొర్రపాటి సాయి (KorrapatiSai) కూడా వచ్చారు. ఇలా కుటుంబ సభ్యులు అందరితో వచ్చిన రాజమౌళి, ఎటువంటి ఆర్భాటాలు అంత పెద్ద పేరు సంపాదించి ఎటువంటి బౌన్సర్లు లేకుండా ఒక మల్టిప్లెక్స్ లో సినిమా చూసి మళ్ళీ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి సామాన్యంగా ప్రవర్థించి వెళ్లిపోయారు. ఈరోజుల్లో ఒక్క సినిమా చేస్తే చాలు, ఆ నటుడు ఎంత హంగామా చేస్తున్నది మనం చూస్తూ ఉంటాం, అతను వస్తున్నాడు అంటే, బౌన్సర్లు అందరిని తోసేసి నానా హంగామా చేస్తారు. కానీ రాజమౌళి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, తాను ఇబ్బంది పడకుండా, చాలా సింపుల్ గా సినిమా చూసి వెళ్ళిపోతాడు. అది అతని గొప్పతనం