NagaChaitanya: తెలుగు, తమిళంలో ఒకేసారి తీసినవన్నీ ప్లాప్, మరి 'కస్టడీ' బ్రేక్ చేస్తుందా
ABN, First Publish Date - 2023-05-08T08:34:58+05:30
చాలామంది తెలుగు నటులు మహేష్ బాబు నుండి నాని వరకు అందరూ ఇంతకు ముందు తెలుగు, తమిళం భాషల్లో ఒకేసారి షూటింగ్ చేసి, విడుదల చేసి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు నాగ చైతన్య 'కస్టడీ' సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. నాగ చైతన్య ఆ సెంటిమెంట్ ని...
నాగ చైతన్య (NagaChaitanya) నటించిన 'కస్టడీ' (Custody) సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఇది రెండు భాషల్లో అంటే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీసి రెండు భాషల్లో విడుదల అవుతోంది. కృతి శెట్టి కథానాయిక కాగా, ప్రియమణి ఇంకో ముఖ్యమైన పాత్రలో కనపడుతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దీనికి దర్శకుడు, అతనికి ఇది మొదటి తెలుగు సినిమా.
అయితే నాగ చైతన్య ఒక్కడే ఇలా తెలుగు తమిళ భాషల్లో చెయ్యడం మొదటి సారి కాదు. ఇంతకు ముందు చాలామంది చేశారు, కానీ అందరూ ప్లాప్ అయ్యారు. దానితో అందరూ బై లింగ్విల్ చెయ్యడం మానేసి ఒక్క తెలుగులోనే చెయ్యడం మొదలెట్టారు. ఈమధ్యనే రామ్ పోతినేని (Ram Pothineni) 'వారియర్' (Warrior) అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో నటించాడు, లింగుస్వామి (Linguswamy) దర్శకుడు దీనికి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) 'స్పైడర్' (Spyder) అనే సినిమాలో నటించాడు. ఇది కూడా తెలుగు, తమిళం లో తీసి ఒకేసారి విడుదల చేశారు. మురుగుదాస్ (Murugudoss) దీనికి దర్శకుడు, కానీ సినిమా డిజాస్టర్ అయింది. తమిళం లో కూడా బాగా ప్రచారం చేశారు, కానీ నడవలేదు.
వీళ్లందరి కన్నా ముందు నాని (Nani) కూడా ఇలాగె చాలా ప్రయత్నాలు చేసాడు. తెలుగు, తమిళం లో ఒకేసారి షూటింగ్, విడుదల అన్నీ చేశారు. కానీ రిజల్ట్ మాత్రం రాలేదు. అందుకే నాని ఇంక తమిళ జోలికి వెళ్లకుండా తెలుగులోనే చేసుకుంటున్నాడు. ఎందుకంటే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీయటం అంత ఈజీ కాదు. తెలుగు ప్రేక్షకులకి, తమిళ ప్రేక్షకులకి నచ్చే అంశాల్లో చాలా వ్యత్యాసం వుంది. అందుకనే నాని ఆ బై లింగ్వల్ జోలికి పోలేదు. అలాగే శర్వానంద్ (Sharwanand) కూడా, అతను కూడా ఇంతకు ముందు తమిళం, తెలుగు చేసాడు, కానీ అంత ఈజీ కాదు అని ఇప్పుడు ఒక్క తెలుగులోనే దృష్టి సారించాడు. అల్లు శిరీష్ (Allu Sirish) మొదటి సినిమా ' గౌరవం' (Gauravam) కూడా తెలుగు, తమిళం లో తీశారు. ఫెయిల్ అయింది. ఈమధ్యనే సందీప్ కిషన్ (Sundeep Kishan) 'మైకేల్' (Michael) సినిమా రెండు భాషల్లో తీసి విడుదల చేసాడు. కానీ ఫలితం రాలేదు. వీళ్ళందరూ తెలుగు నటులు, తమిళం లో కూడా ప్రయత్నం చేసి విఫలం అయ్యారు.
ఇప్పుడు నాగ చైతన్య 'కస్టడీ' అనే సినిమాతో రెండు భాషల్లో నటించి, విడుదల చేస్తున్నాడు. ఇందులో ఎక్కువ తమిళ నటులు వున్నారు. అరవింద్ స్వామి (Aravind Swamy), శరత్ కుమార్ (Sarath Kumar) ఇంకా కొంతమంది ఇలా తమిళ నటులు వున్నారు. వెంకట్ ప్రభు టాలెంట్ వున్న దర్శకుడే, కానీ రెండు భాషల్లో ప్రేక్షకులని ఇంప్రెస్ చెయ్యాలంటే అంత ఈజీ కాదు. ఒక భాషలో తీసి, తరువాత డబ్బింగ్ చేసి విడుదల చెయ్యటం కూడా ఉండేది. ఇప్పుడు నాగ చైతన్య పెద్ద సాహసమే చేస్తున్నాడు అని చెప్పాలి. ఇందులో అతను విజయం సాధించి ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడనే ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడు అక్కినేని కుటుంబానికి ఒక హిట్ కావాలి. అవసరం కూడా.