Manchu Manoj: రాజకీయాల్లోకి వస్తున్నాడా, కాంట్రవర్సీ ఎం.ఎల్.ఏ పక్కన ఏమి చేస్తున్నట్టు !
ABN, First Publish Date - 2023-03-06T16:01:43+05:30
మంచు మనోజ్, మౌనిక దంపతులతో హైదరాబాద్ నుండి తిరుపతి కి వెళ్లిన వాళ్లలో తెలంగాణాకి చెందిన ఒక వివాదాస్పద ఎం.ఎల్.ఏ ఉండటం అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది.
మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounica) ల వివాహం కొన్ని రోజుల కిందట రంగ రంగ వైభవంగా హైదరాబాద్ లోని మంచి లక్ష్మి (Manchu Lakshmi) ఇంట్లో అయింది. ఆ తరువాత సాంఘీక మాధ్యమాల్లో కొన్ని వివాహం జరిగినప్పటి ఫోటోస్ పెట్టారు, మీడియా వాళ్ళని మాత్రం రానివ్వలేదు. కానీ వివాహం తరువాత, మనోజ్, మౌనిక దంపతులు, కర్నూల్, తిరుపతి పర్యటనల ఫోటోలు మాత్రం విశేషంగా, విస్తృతంగా అన్ని దగ్గరలా షేర్ చేసారు. అలాగే మనోజ్ దంపతులు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్న విషయాలు కూడా ముందుగానే మీడియా కి సమాచారం ఇస్తూ, ఫోటోస్ వెంట వెంటనే పంపిస్తూ మనోజ్ పి.ఆర్ టీము అన్నీషేర్ చేశారు.
అయితే ఇంకొక విషయం కూడా మెల్ల మెల్లగా బయటపడుతోంది. కొన్ని రోజులు తరువాత మంచు మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వుంది అని, అధికారికంగా తనీ చెప్తాడు అని కూడా అంటున్నారు. దానికి నాంది గానే ఈ పర్యటనలు అన్నీ అని అంటున్నారు. భూమా మౌనిక తాతగారు ఎస్.వి. సుబ్బారెడ్డి (SV Subba Reddy) కర్నూల్ జిల్లాలో సీనియర్ రాజకీయవేత్త, ఆయనని అలాగే మౌనిక మేనమామ, మోహన్ రెడ్డి (SV Mohan Reddy) ని కలిసింది అందుకేనట. రాబోయే రోజుల్లో మనోజ్ తన ఫోకస్ భూమా కుటుంబం ఎక్కడెక్కడ పోటీ చేసారో ఆయా నియోజకవర్గాల మీద పెడతాడని తెలిసింది.
అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర అంశం ఏంటి అంటే, తెలంగాణ కి చెందిన వివాదాస్పద బి.ఆర్.ఎస్. ఎం.ఎల్.ఏ పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లే మనోజ్, మౌనికలతో ఉండటం. రోహిత్ రెడ్డి ఎందుకు వాళ్లవెంట వెళ్ళాడు, అతనికి ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం అని ఆరా తీస్తే, రోహిత్ రెడ్డి, మంచు మనోజ్ కి చాలా దగ్గర స్నేహితుడు అని తెలిసింది. ఇప్పటి నుండి కాదు, వాళ్లిద్దరూ ఎప్పటి నుండో స్నేహితులు అని, అందువల్లనే రోహిత్ రెడ్డి, మనోజ్ వెనకాల వెళ్ళాడు అని చెపుతున్నాడు. చాలామంది, రోహిత్ రెడ్డి భూమా కుటుంబానికి చుట్టం అని అనుకుంటున్నారు. కానీ అతను మనోజ్ కి స్నేహితుడు కావటం వల్లనే అతని వెనకాల వెళ్ళాడు అని అంటున్నారు. ఏమైనా ఇలా ఒక వివాదాస్పద ఎం.ఎల్.ఏ ని వెంట బెట్టుకొని వెళ్ళటం, అది మనోజ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడానికి అయి ఉంటుందని కూడా అంటున్నారు.