English titles: తెలుగు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్ పెడితే ఏమవుతుందో తెలుసా...
ABN, First Publish Date - 2023-02-15T13:07:09+05:30
ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.
ఈమధ్య చలన చిత్ర పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్న విషయం ఏంటి అంటే, తెలుగు సినిమాలకి ఆంగ్ల టైటిల్స్ (English titles for Telugu cinemas) పెడితే ఆ సినిమాలు సరిగ్గా నడవటం లేదు అని. వారి చర్చ ఎలా వున్నా, ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి. తమిళ్ సినిమా పరిశ్రమలో అక్కడి దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా తమిళ టైటిల్స్ పెట్టడానికే ఇష్టపడతారు, కానీ తెలుగు సినిమాలకి మాత్రం ఆలా ఆలోచించారు.
అయితే ఈమధ్య వచ్చిన ఆంగ్ల టైటిల్స్ పెట్టిన తెలుగు సినిమాలు మీద ఓ కన్నేద్దాం. ఈమధ్యనే విడుదల అయిన సినిమా 'అమిగోస్', (Amigos) ఇందులో కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) మూడు విభిన్న పాత్రలు పోషించాడు. అయితే 'అమిగోస్' అంటే చాలామందికి తెలియలేదు, అదీ కాకుండా ఆ సినిమాలో నేపధ్యం కూడా డాపుల్ గేంగర్ (Doppelganger) అని ఆంగ్లం లోనే ప్రచారాన్ని చేసారు. అందువలనే ఈ సినిమా అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు అని ఒక టాక్ నడిచింది. ఎందుకంటే సినిమాకి కుటుంబ ప్రేక్షకులు రావాలి, అప్పుడే ఆ సినిమా విజయం సాధిస్తుంది.
ఇంకా ఇంకో సినిమా 'హంట్', (Hunt) ఇది సుధీర్ బాబు (Sudheer Babu) నటించింది. ఇది కూడా అంతే. ఆంగ్ల టైటిల్, పోయింది. నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన 'ది ఘోస్ట్' (The Ghost). ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమీ ప్రభావం చూపలేకపోయింది. అలాగే రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన 'ది వారియర్' (The Warrior) కూడా విజయం సాధించలేదు. ఇంకో సినిమా 'లైక్ షేర్ సబ్ స్క్రయిబ్' (Like Share Subscripe) మొదటి సారిగా దర్శకుడు మేర్లపాక గాంధీకి (Merlapaka Gandhi) అపజయాన్ని ఇచ్చింది. యువకులకు ఇలాంటివి తెలుసేమో కానీ, వాళ్ళు ఒక్కరే వస్తే సినిమా విజయం సాధించాడు. అలాగే నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన 'థేంక్ యు' (Thank You) కూడా ఆడలేదు.
విజయ్ దేవరుకొండ (Vijay Deverakonda), పూరి జగన్ (Puri Jagan) సినిమా 'లైగర్' (Liger) అయితే చెప్పనక్కరలేదు, ఎంత అపజయం పాలయిందో, ఎన్ని ఇక్కట్లు తెచ్చి పెట్టిందో. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు (MS Raju) '7 డేస్ 6 నైట్స్' (Seven Days Six Nights) అనే సినిమా టైటిల్ తో వచ్చారు. దాని ప్రభావం కూడా ఏమి లేదు. ఆది సాయికుమార్ ఈమధ్య 'టాప్ గేర్' (Top Gear) అనే సినిమాతో వచ్చాడు, సినిమా బాగున్నా ఆడలేదు.
'వాల్తేరు వీరయ్య' లాంటి పెద్ద విజయం సాధించిన చిరంజీవి (MegaStar Chiranjeevi), అతని ముందు సినిమా 'గాడ్ ఫాదర్' (God Father) అని పెట్టి విడుదల చేసారు. కానీ వాల్తేరు వీరయ్య సినిమా కి వచ్చిన రెవిన్యూ తో చూస్తే కానక 'గాడ్ ఫాదర్' ఎక్కడ ఉందొ అందరికి తెలిసిందే. ఇంకా 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' లాంటి సినిమాలు అసలు కనిపించలేదు ఎక్కడా. అయితే అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'హిట్: సెకండ్ కేసు' (Hit: The second case) లాంటి సినిమా ఆడింది అనే చెప్పాలి. అలాగే అతని సినిమానే 'మేజర్' కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తెలుగు టైటిల్ పెట్టడానికి ప్రయత్నిస్తే కొంతలో కొంత పట్టణాల్లో కాకుండా, 'బి', 'సి' సెంటర్ లో ఒక్కసారి ఆ టైటిల్ చూసి చూడాలనుకుంటే థియేటర్ కి వస్తారు.