Tollywood Box Office: నాగచైతన్య సినిమా శని, ఆదివారాల్లో ఎంత చేసిందో తెలుసా...
ABN, First Publish Date - 2023-05-15T13:01:32+05:30
నాగ చైతన్య చాలా నమ్మకంగా, ఎంతో ఆశ పెట్టుకున్న 'కస్టడీ' సినిమా మొదటి రోజు మామూలు కలెక్షన్స్ వసూలు చేసింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ పెరగవచ్చు అని చిత్ర నిర్వాహకులు భావించారు, కానీ మొత్తం కలెక్షన్స్ ఎలా వున్నాయంటే...
అక్కినేని నాగ చైతన్య (NagaChaitanya) నటించిన సినిమా 'కస్టడీ' (Custody) తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. దీనికి వెంకట్ ప్రభు (VenkatPrabhu) దర్శకుడు కాగా, కృతి శెట్టి (KrithiShetty) కథానాయిక. ఈ సినిమా గత వారం విడుదల అయింది, మొదటి రోజు ఈ సినిమాకి అంత పాజిటివ్ టాక్ రాలేదు. మొదటి రోజు కలెక్షన్స్ కూడా చాలా మామూలుగా వున్నాయి సుమారు రూ.2.50 కోట్లు కలెక్టు చేసింది ఈ సినిమా. అయితే శని, ఆదివారాలు వీకెండ్ సెలవుల్లో కొంచెం పిక్ అప్ అవుతుందేమో అని ఈ చిత్ర నిర్వాహకులు భావించారు.
కానీ వాళ్ళు ఆశించినది అవ్వకపోగా, కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోయాయి. మొత్తం మూడు రోజులకు గాను ఈ సినిమా రూ 11.30 కోట్ల గ్రాస్ కలెక్టు చేసింది, అంటే సుమారు రూ 4.65 కోట్ల షేర్ కలెక్టు చేసింది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా టోటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. చిట్టూరి శ్రీనివాస్ (Chitturi Srinivas) ఈ సినిమాకి నిర్మాత.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ 22 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇప్పుడు చూస్తున్న కలెక్షన్స్ బట్టి ఈ సినిమా తీసుకున్న బయ్యర్స్ కి పెద్ద లాస్ ఉంటుంది అని ఆశించవచ్చు అని అనలిస్ట్స్ చెపుతున్నారు. ఈ సినిమాతో నాగ చైతన్య తమిళంలో కూడా ఆరంగేట్రం చేశారు. చాలామంది తమిళ నటులు శరత్ కుమార్ (R SarathKumar), అరవింద్ స్వామి (AravindSwamy), రాంకీ, జీవ (Jiiva) లాంటి వారు ఉన్నప్పటికీ ఈ సినిమా అక్కడ కూడా అసలు కలెక్షన్స్ ఏమీ రాబట్టలేకపోయాయిన్ది. అలాగే విదేశాల్లో కూడా డిజాస్టర్ అయింది. ఇది నాగచైతన్యకి రెండో ఫ్లాప్ వరసగా. ఇంతకు ముందు 'థేంక్ యు' (Thank You) అనే సినిమా కూడా ఫ్లాప్ అయింది. కృతి శెట్టికి అయితే ఇది మరో డిజాస్టర్, ఆమెకి ఇది నాలుగో, ఐదో సినేమానో వరసగా ఫ్లాప్.
ఇంకా వేరే చిన్న చిన్న సినిమాలు విడుదల అయ్యాయి కానీ, ప్రేక్షకులు ఇంకా ఆ సినిమాలు దేనినీ పట్టించుకోలేదు. ఈ వారం సినిమాలు అన్నీ బాగోలేకపోవటం వలన, సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) నటించిన 'విరూపాక్ష' (Virupaksha) సినిమా మంచి లాభం ఉండొచ్చు అని భావిస్తున్నారు.