సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NagaShaurya: మాకు సినిమా అంటే పిచ్చి ఇష్టం, మాకు ఇది తప్పితే వేరేది తెలీదు

ABN, First Publish Date - 2023-07-05T17:18:54+05:30

వంగవీటి రంగా గారి జీవితానికి ఈ 'రంగబలి' సినిమా కథకి ఎటువంటి సంబంధం లేదని నాగ శౌర్య చెప్పాడు. అలాగే ఇప్పుడున్న పోటీలో సినిమా కోసం ఏదైనా చెయ్యాలని, ఎంతైనా కష్టపడాలని, ఆలా చేసినప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పాడు

Naga Shaurya from Rangabali
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగశౌర్య (NagaShaurya) టాలెంట్ వున్న నటుడు, ఎక్కువగా కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు 'రంగబలి' #Rangabali అనే సినిమాకి కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి (PavanBasamshetty) తో చేసాడు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ (YuktiThareja) కథానాయికగా కాగా ఈ సినిమా జూలై 7న విడుదల అవుతోంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను నాగశౌర్య పంచుకున్నాడు. ఈ సినిమా గురించి అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణాలు చెప్పాడు.

ప్రచారాలు ఈ సినిమా చూసి చేస్తాను అని చెప్పా, అలాగే సినిమా చూసాక చాలా నమ్మకం వచ్చిందని, చాలా మంచి సినిమా అవుతుందని తనకి తెలుసు, అందుకే ప్రేక్షకులకు కూడా సినిమా గురించి ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను అని చెప్పాడు నాగశౌర్య. దర్శకుడు అనేవాడు అందులో నటుడికి కొంచెం స్పేస్ ఇవ్వాలని, ఈ సినిమా దర్శకుడు పవన్ ఆలా తనకి స్పేస్ ఇచ్చాడని చెప్పాడు. అలాగే అతనికి కూడా ఏ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొవద్దని చెప్పి, ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పాను. తనకి తన సినిమాల విషయంలో అనుభవం వుంది. ఎక్కడ కరెక్ట్ గా జరుగుతుందో చెప్పలేను కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో అర్ధమైపోతుంది అని, అందుకని ఆ అనుభవాన్ని, పవన్ విజన్ ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగాం అని అంటున్నాడు నాగశౌర్య.

ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగశౌర్య స్పృహ తప్పిపోయాడు అని, అంబులెన్సు వచ్చిందని ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు చేసినప్పుడు చాలా కఠినంగా #Rangabali ఆహార నియమాలు పాటించడం వలన ఆలా జరిగిందని అప్పుడు అన్నారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ, "నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి. ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ ఎక్స్ టార్డినరిగా నటన, డాన్స్, యాక్షన్ ఒకటేమిటి అన్నీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నేనూ ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఆ క్రమంలో కొన్నిఆరోగ్య సమస్యలు వస్తాయి, ఒకొక్కసారి గాయాలు కూడా అవుతాయి. మనం ఎంచుకున్న వృత్తిలో ఇవన్నీ భాగమే. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది," అని చెప్పాడు నాగశౌర్య.

నాగశౌర్య తల్లిదండ్రులు ప్రొడక్షన్ సంస్థ పెట్టి చాలా సినిమాలు తీశారు, అందులో కొన్ని నిరాశ పరిచాయి కూడా. వాటి గురించి మాట్లాడుతూ, ఏ ప్రొడక్షన్ సంస్థ అయినా పది హిట్ సినిమాలు తీసాక, ఒక్క సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు అని చెప్పాడు. తాను, తన కుటుంబం సినిమా అంటే పిచ్చి ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తున్నాం తప్పితే డబ్బులు సంపాయించుకోవాలని కాదు అని చెప్పాడు. "మాకు సినిమా అంటే పిచ్చి ఇష్టం. మాకు ఇది తప్పితే వేరేది తెలీదు," అని చెప్పాడు నాగశౌర్య.

ఈ 'రంగబలి' సినిమా కథ వంగవీటి రంగా (VangaveetiRanga) గారి జీవితానికి స్ఫూర్తిగా ఉంటుందా అని అడిగితే, లేదు అని చెప్పాడు. రంగా గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సినిమా చూసిన తర్వాత 'రంగబలి' అంటే ఏమిటనేది తెలుస్తుంది అని అన్నాడు.

Updated Date - 2023-07-05T17:18:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!