సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

#VS11: హీరో కాదు.. విలన్ కాదు.. విశ్వక్ సేన్ కొత్త సినిమా ఇదే..

ABN, First Publish Date - 2023-03-29T12:19:37+05:30

‘అవసరం కోసం దారులు మార్చే పాత్రలు తప్ప.. హీరోలు.. విలన్లు లేరీ నాటకంలో’ అని నటుడు సాయికుమార్ ఓ సినిమాలో సంభాషణలు పలుకుతాడు.

Vishwak Sen
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అవసరం కోసం దారులు మార్చే పాత్రలు తప్ప.. హీరోలు.. విలన్లు లేరీ నాటకంలో’ అని నటుడు సాయికుమార్ ఓ సినిమాలో సంభాషణలు పలుకుతాడు. ఆయన చెప్పినట్లు నిజమైన ప్రపంచంలో పూర్తి మంచివారుగాని.. పూర్తి చెడ్డవారుగాని ఉండకపోవచ్చు. అప్పటివరకు మంచిగా ఉన్నవారు.. అవసరం వస్తే తమ స్వలాభం కోసం అడ్డదారులు తొక్కినవారు ఉన్నట్లు చాలాసార్లు చదివాం. దీనిపై ఇప్పటికే పలువురు హీరోలు ఈ కానెప్ట్‌తో సినిమాలు చేశారు. తాజాగా టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా ఇదే బాట పడుతున్నాడు.

ఇటీవలికాలంలో సినీ పరిశ్రమలో ఎవరి సపోర్టు లేకుండా తమకంటూ గుర్తింపు పొందిన అతి కొద్దిమంది నటుల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఇటీవలే ‘దాస్ కా దమ్కీ’ చిత్రంతో సాధించిన విషయం తెలిసిందే. ఆ ఆనందంలో ఉండగానే.. ఆయన కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘వీఎస్11’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (మార్చి 29న) ఈ సినిమా గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అందులో.. ‘‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో, మంచిచెడులు లేవు! కేవలం అవసరానికి రంగులు మార్చడమే ఉంది. మా మాస్ క దాస్‌ను మునుపెన్నడూ చూడని మాస్ ‘గ్రే’ షేడ్‌లో #VS11లో చూపిస్తున్నాం’’ అని రాసుకొచ్చారు. అయితే.. హీరోయిన్‌తో పాటు మిగిలిన వివరాలు ఎనౌన్స్ చేయలేదు. దీంతో సోషల్ మీడియా విశ్వక్ సేన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. నెటిజన్లు వరుసగా పోస్టులు షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ‘#Happybirthdayvishwaksen’, ‘#VS11’, ‘Mass Ka Das’ గురించి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.


Updated Date - 2023-03-29T12:19:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!