Vishnu Priya Marriage: క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి!
ABN, First Publish Date - 2023-06-18T15:26:06+05:30
విష్ణు ప్రియ టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. యాంకర్ షోల్లో యాంకర్‌గా, నటిగా, పలు చిత్రాల్లో ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఈ మధ్యకాలంలో ఓ సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న విష్ణుప్రియ.. తనకి జేడీ చక్రవర్తి అంటే ఇష్టమని, ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పారు. జేడీ తల్లి అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని అన్నారు.
విష్ణు ప్రియ (vishnu Priya) టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. యాంకర్ షోల్లో యాంకర్‌గా, నటిగా, పలు చిత్రాల్లో ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఈ మధ్యకాలంలో ఓ సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న విష్ణుప్రియ.. తనకి జేడీ చక్రవర్తి (Jd Chakravarthy) అంటే ఇష్టమని, ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పారు. అంతే కాకుండా జేడీ తల్లి అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని అన్నారు. ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై జేడీ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. విష్ణుప్రియ అలా చెప్పడానికి గల కారణాన్ని తెలిపారు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అది ప్రేమ కాదని ఆయన స్పష్టం చేశారు.
‘‘విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం ఇటీవల ఓ సిరీస్‌లో నటించాం. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని చేశాం. ఆ సమయంలో దర్శకుడు విష్ణుప్రియకు చిన్న సలహా ఇచ్చాడు. అదేంటంటే.. ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని చెప్పాడు. అలా, నేను నటించిన సినిమాలన్నీ చూసి ఆయా చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడ్డారు. అంతే తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురువు, శిష్యుల అనుబంధమే ఉంది. మేమిద్దరం చాలా తక్కువగా మాట్లాడుకుంటాం’’ అని జె.డి.చక్రవర్తి అన్నారు. జేడీ చక్రవర్తి, విషుప్రియ కలిసి ‘దయ’ అనే సిరీస్ (Daya Web series) చేశారు. త్వరలో ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.