కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salaar : క్లారిటీ ఇచ్చినా కష్టాలు తప్పట్లేదు!

ABN, First Publish Date - 2023-12-14T18:23:46+05:30

ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్‌. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ చిత్రంపై చాలా గాసిప్పులొచ్చాయి.

ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్‌(Salaar) . ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ చిత్రంపై చాలా గాసిప్పులొచ్చాయి. అందులో ఒకటి ఈ చిత్రంలో యశ్‌ (yash) నటిస్తున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అంతే కాదుచ ‘కేజీయఫ్‌’కు ‘సలార్‌’కు లింక్‌ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పలు మాఽధ్యమాల్లో వచ్చిన ఈ వార్తలపై సింగర్‌ తీర్థ సుభాష్‌ వివరణ ఇచ్చారు. అయినా గాసిప్పులు మాత్రం ఆగలేదు. ఎట్టకేలకు నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ (vijay kiragandhur) స్పందించారు.

‘‘సలార్‌’కు, ‘కేజీయఫ్‌’కు ఎలాంటి సంబంధంం లేదని మా దర్శకుడు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమాలో యశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలొస్తున్నాయి. నిర్మాతగా నాకు తెలిసినంత వరకూ మా చిత్రంలో ఎలాంటి అతిథి పాత్రలు లేవు. ఆయా వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన చెప్పారు. అయితే ఈ వదంతుల వెనక ఓ కారణం ఉంది, గాయని తీర్థ సుభాష్‌ ఈ చిత్రంలో పో పాట పాడింది, ఈ క్రమంలోనే ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ ఇందులో యశ్‌ కూడా ఉన్నారని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. ‘‘కేజీఎఫ్‌’ సినిమాను నేను చాలా సార్ల్లు చూశా. అందులో యశ్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో మ్యూజిక్‌ గురించి మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. అలా ఓ సందర్భంలో ‘కేజీఎఫ్‌’ గుర్తొచ్చి యశ్‌ పేరు చెప్పాను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేశారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు కీలక పాత్రధారులు.

Updated Date - 2023-12-14T18:23:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!