Vijay Deverakonda: చిన్నప్పుడు స్నేహితులు చేసిన పని గుర్తించుకుని మరీ..
ABN, First Publish Date - 2023-02-27T20:59:43+05:30
ఓవైపు నటనలో తన స్థాయిని పెంచుకుంటూనే.. మరో వైపు అభిమానులకి వీలైనంత ప్రేమని అందిస్తున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తన చిన్నప్పుడు
ఓవైపు నటనలో తన స్థాయిని పెంచుకుంటూనే.. మరో వైపు అభిమానులకి వీలైనంత ప్రేమని అందిస్తున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తన చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు పెట్టుకుని మరీ.. ఇప్పుడు ఆ జ్ఞాపకాలను తన అభిమానులకు ఆయన అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ‘దేవరసాంటా’ (DeveraSanta)గా మారి.. తన అభిమానులకి సంతోషాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 100 మందికి (100 People) జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఆయన అందించాడు.
‘దేవరసాంటా’లో భాగంగా తను సెలక్ట్ చేసిన 100 మందిని.. తన ఖర్చులతో మనాలి ట్రిప్‌కి (Trip to Manali) పంపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ట్రిప్‌కి సంబంధించిన గ్లింప్స్‌ని విజయ్ తన హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా.. ఇందులో సెలక్ట్ అయినటువంటి వారు విజయ్ మీద తమ ప్రేమ, కృతజ్ఞత, తమ జీవితంలో ఈ ట్రిప్ ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఈ గ్లింప్స్ చివరిలో అందరూ ఎమోషనలై.. విజయ్‌ని హగ్ చేసుకోవడం.. ఆ 100 మంది ఒకరికొకరు ఎమోషనల్‌గా దగ్గరవ్వడం గమనించవచ్చు.
దీనిపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్‌కి వెళ్లిన స్మృతులని గుర్తుచేసుకుంటూ.. తన దగ్గర సరైన సంపాదన లేనప్పుడు ఆ ట్రిప్‌కి తన స్నేహితులు తనని తీసుకెళ్లడం ఎంత సంతోషాన్నిచ్చిందో తెలిపాడు. అలాంటి సంతోషాన్ని పంచాలనే ఎంపిక చేయబడిన 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చుతో మనాలి ట్రిప్‌కి తీసుకెళ్లడమే కాకుండా తన తల్లితండ్రులతో (Vijay Deverakonda Parents పాటు వెళ్లి వారితో సమయం గడిపినట్లుగా తెలిపాడు.
ఇవి కూడా చదవండి
*********************************