Vijay Devarakonda: పెళ్లి తర్వాత అలాగే ఉండాలనుకుంటున్నా...
ABN, First Publish Date - 2023-07-13T14:46:05+05:30
విజయ్ దేవరకొండ వేదికపై వృత్తి, వ్యక్తిగతం ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. క్షణాల్లోనే ఆ మాటలు వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఖుషి’(Kushi)ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలను తన వ్యక్తిగత జీవితానికి కలిపి మాట్లాడటమే కారణం. ‘
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వేదికపై వృత్తి, వ్యక్తిగతం ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. క్షణాల్లోనే ఆ మాటలు వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఖుషి’(Kushi)ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలను తన వ్యక్తిగత జీవితానికి కలిపి మాట్లాడటమే కారణం. ‘ఖుషి’ చిత్రం నుంచి ఇటీవల ‘ఆరాధ్య’ అంటూ సాగే ప్రేమ గీతం విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలకు ముందు విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లయిన తర్వాత ఆ పాటలో )Vijay Devarakonda marriage) చూపించిన విధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పాడు.
‘‘ఖుషి’ చిత్రంలో ‘ఆరాధ్య’ (Aradhya song)నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి. వివాహం చేసుకున్న తర్వాత సంవత్సరం పాటు జంట ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. ఎంతో అద్భుతంగా సాగే ఈ పాటలో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చిత్రీకరించారు. కానీ భవిష్యత్తులో నా వైవాహిక జీవితం ఈ పాటలో మాదిరిగానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నారు. విజయ్‌ను ఫాలో అయ్యే అభిమానులు ‘పెళ్లి తర్వాత అన్న బాగానే ప్లాన్ చేశాడు’ అని కామెంట్ పెడుతున్నారు. విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ చిత్రం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.