కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VD - Family Star : ఐరనే వంచాలా ఏంటి? ఇంటర్‌నెట్‌.. ఏం నడుస్తోంది!

ABN, First Publish Date - 2023-10-26T21:28:47+05:30

ఐరనే వంచాలా ఏంటి?’ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న విషయాల్లో ఇదొకటి. ‘గీత గోవిందం’ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), పరశురామ్‌ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family star) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

‘ఐరనే వంచాలా ఏంటి?’ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న విషయాల్లో ఇదొకటి. ‘గీత గోవిందం’ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), పరశురామ్‌ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family star) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో ‘ఉల్లిపాయలు కొంటే మనిషి కాదా? పిల్లల్ని రెడీ చేేస్త మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?’ అని విజయ్‌ విలన్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. ఐరన్‌ రాడ్‌ను వంచుతాడు. ప్రభాస్‌ ‘మిర్చి’ సినిమాలోని ఓ సన్నివేశానికి ‘ఐరనే వంచాలా ఏంటి’ డైలాగ్‌ను జోడించిన విజయ్‌ దేవరకొండ ఆ వీడిమోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఇంటర్నెట్‌.. అసలు ఏం నడుస్తోంది’ అని కామెంట్‌ పెట్టాడు.

ఆ తర్వాత ఆ వీడియో ట్విట్టర్‌ గూటికి చేరింది. దీన్ని చూసిన ఫాన్స్  క్రియేటివిటీతో కొన్ని హిట్‌ సినిమా సీన్లకు ఈ ఐరన్‌ డైలాగ్‌ను జతచేసి పోస్ట్‌ చేయడంతో ఈ డైలాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. నిర్మాణ సంస్థ పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ తాజా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తోంది.

Updated Date - 2023-10-26T21:29:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!