కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VD 13 : టీజర్‌కి ముహూర్తం కుదిరింది!

ABN, First Publish Date - 2023-10-15T16:38:29+05:30

విజయ్ దేవరకొండ(Vijay devarakonda), మృణాల్ ఠాకూర్ (mrunal Thakur)జంటగా నటిస్తున్న సినిమా వీడీ 13. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది.



విజయ్ దేవరకొండ(Vijay devarakonda), మృణాల్ ఠాకూర్ (mrunal Thakur)జంటగా నటిస్తున్న సినిమా వీడీ 13. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి  మేకర్స్ కొత్త అప్ డేట్ వెల్లడించారు. ఈ నెల 18న సాయంత్రం 6.30 నిమిషాలకు వీడీ 13 సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎస్వీసీ ఇవాళ అనౌన్స్ చేసింది. స్మాల్ టీజర్ ద్వారా ఈ సినిమా టైటిల్ వెల్లడించనున్నారు. ప్రస్తుతం వీడీ 13 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది.

Updated Date - 2023-10-15T16:39:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!