Vidya Balan: కథ చెప్పి.. మిగిలినవి రూమ్‌లో అన్నాడు!
ABN, First Publish Date - 2023-03-11T12:25:49+05:30
రెండు మూడేళ్లగా క్యాస్టింగ్ కౌచ్ (casting couch) సినీరంగంలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎంతోమంది తారలు దీనిపై గొంతెత్తి మాట్లాడారు.
రెండు మూడేళ్లగా క్యాస్టింగ్ కౌచ్ (casting couch) సినీరంగంలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎంతోమంది తారలు దీనిపై గొంతెత్తి మాట్లాడారు. తాజాగా ఇదే అంశంపై నటి విద్యాబాలన్ (Vidya balan) సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తెలివిగా వ్యవహరించి అతడి బారి నుంచి తప్పించుకున్నట్లు విద్యా బాలన్ చెప్పుకొచ్చారు.
‘క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో నేను చిక్కుకోలేదు. అది నా అదృష్టం అనుకోవాలి. చిత్ర పరిశ్రమలోకి వచ్చే ముందు ఇక్కడి పరిస్థితుల గురించి చాలా విన్నాను. (Dirty picture heroine in Casting couch) చాలామంది కథలు కథలగా చెప్పారు. నా తల్లిదండ్రులు భయపడి సినిమాల్లోకి పంపడానికి ఇష్టపడలేదు. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ఇలా సమస్యలు ఎదురయ్యాయి. చాకచక్యంగా తప్పించుకున్నా. ఓ సారి ఎదురైన సంఘటన మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. ఓ యాడ్ షూట్ కోసం చెన్నై వెళ్లా. అక్కడ ఓ డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాలనుకున్నాడు. ఆ సినిమా సిట్టింగ్‌లో ఉండగా ఇద్దరం కలిసి కాఫీ షాప్‌కు వెళ్లాం. కథ గురించి చెబుతున్న సమయంలో.. ‘మిగతా విషయాలను మనం రూమ్‌కు వెళ్లి మాట్లాడుకుందాం’ అన్నాడు. ఆ సమయంలో నేను ఒక్కదాన్నే ఉండడంతో భయపడుతూనే రూమ్‌క వెళ్లా. తెలివిగా వ్యవహరించి గది తలుపులు తెరిచే ఉంచాను. అతనికి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. ఆ క్షణం అలా చేయమని నాకు ఎవరూ సలహా ఇవ్వలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నన్ను నేను రక్షించుకున్నా’’ అని చెప్పారు. ‘డర్టీ పిక్చర్’తో మంచి పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ తెలుగులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో నటించారు.