Saindhav: ‘ప్లీజ్.. నవ్వు నాన్న’.. ఏడిపించేస్తున్న వెంకీమామ
ABN, Publish Date - Dec 29 , 2023 | 07:13 PM
విక్టరీ వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘సైంధవ్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన మూడో సింగిల్ ‘బుజ్జికొండవే’ తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మరో షేడ్ ను ప్రజెంట్ చేయడమే కాక కంట తడి పెట్టించేలా ఉంది.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘సైంధవ్’(Saindhav). సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ మొదలు ట్రైలర్, పాటలు ఒకదాన్ని మించి మరోటి ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులు ఊహించని థ్రిల్స్‌తో, ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు మంచి భావోద్వేగాల మిళితంగా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన రెండవ సింగిల్ హీరో కుటుంబంలోని ఆనందాన్ని చూపించగా తాజాగా విడుదలైన మూడో సింగిల్ ‘బుజ్జికొండవే’( Bujji Kondave) తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మరో షేడ్ ప్రజెంట్ చేస్తోంది.
తండ్రీకూతుళ్ల బంధం సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తుంది. చిత్రంలో వెంకటేష్(Venkatesh) కూతురు ఆరోగ్య సమస్యతో సతమతమవడం, దీంతో తండ్రి వెంకటేష్ ఈ పెయిన్‌ను తనలోనే దాచుకుంటూ కూతురిని సంతోషంగా ఉంచడం కోసం తాపత్రయ పడడం, పలు సందర్భాల్లో కూతురి పరిస్థితిన చూస్తూ ఎమోషనల్‌గా బరస్ట్ అవడం ఆ పాటని చూసే వారికి కంటతడి పెట్టించేలా ఉంది. పాపకి తల్లి కానప్పటికీ తన సొంత కూతురిలా చూసుకుంటుం శ్రద్ధా శ్రీనాథ్ ఈ ఎమోషనల్ జర్నీ భాగం కావడం మన మనసులని మరింతగా కదిలిస్తుంది.
ఇంకా ఈపాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా, సంతోష్ నారాయణన్ సిట్యు వేషన్ కి తగినట్లు అద్భుతమైన సంగీతం అందించారు. సీతారామం, భగవంత్ కేసరి చిత్రాలలోని పాటలతో మంచి జోష్‌లో ఉన్న ఎస్పీ చరణ్ వాయిస్ ఈ పాటలోని భావోద్వేగాలకు మరింత గాఢతను జోడించి మనసుని హత్తుకునేలా ఆలపించారు. జోడించారు.
వెంకటేష్(Venkatesh), నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించగా శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సైంధవ్(Saindhav) సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారతీయ భాషలతో పాటు, హిందీలోనూ విడుదల కానుంది.