Venu Yeldandi: ‘బలగం’ వివాదంపై స్పందించిన దర్శకుడు.. చిల్లర వ్యక్తులు చేసే డ్రామా.. దిల్ రాజును అభాసు పాలు చేయడానికే ప్రయత్నాలు..
ABN, First Publish Date - 2023-03-05T20:04:33+05:30
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’ (Balagam). ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’ (Balagam). ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. హర్షిత్, హన్షిత నిర్మించారు. ఈ చిత్రం మార్చి 3న విడుదలైంది. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఈ సినిమా కాపీరైట్ వివాదంలో చిక్కుకొంది. జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి ఈ కథ తనదేనంటూ మీడియా ముందు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు వేణు ఎల్దండి (Venu Yeldandi) తాజాగా స్పందించారు.
‘‘చనిపోయిన వ్యక్తి చుట్టూ జరుగుతున్న విషయాలను చూడగానే నాకొక కొత్త ప్రపంచం కనిపించింది. చావులో ఇన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయా..? అనిపించింది. అప్పటి నుంచి నా మనస్సులో వందలాది సన్నివేశాలు ఉండిపోయాయి. కాకులు ముట్టడం అనేది నేనేమీ కొత్తగా చెప్పలేదు. అది మన సాంప్రదాయం. తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి ఉంది. అందుకే దీనిపై సినిమా చేయాలనుకున్నాను. ముందుగా కామెడీ సీన్స్ రాసుకున్నాను. అనేక ఊళ్లను తిరిగి అక్కడి సంప్రదాయాలను తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే ‘బలగం’ సినిమా కథ కాదు. మన తెలుగు వారి జీవితాల్లో చోటుచేసుకునే అనుభూతులు. మన జీవితాల్లో తరచుగా జరుగుతుంటాయి. చిత్రాన్ని రూపొందించాలనుకున్నప్పుడు కొంత పరిశోధన చేశాను. ‘బలగం’ కథను రాసుకున్నాను. క్లైమాక్స్ కోసమే మూడు నెలలు కష్టపడ్డాను. చావు చుట్టు తిరిగే పాయింట్ మీద చాలా కథలు వచ్చాయి. 2000లో బెంగాలీలో అద్భుతమైన కథ వచ్చింది. 90ల్లో మరాఠీలో ఓ సినిమా వచ్చింది. తమిళ్, కొరియన్‌లోను చిత్రాలు వచ్చాయి. అంటే వాళ్లందరూ కాపీ కొట్టారంటే కుదురుతుందా..?’’ అని వేణు తెలిపారు.
‘‘నా సినిమా కథను, సతీష్‌గారు రాసిన కథను చదివి మాట్లాడండి. ఒకటిన్నర పేజీ కథకు వంద పేజీల కథను ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది. రైటర్ అసోసియేషన్‌కు వెళ్లి మాట్లాడండి. వాళ్లు ఏది చెబితే అది చేస్తాను. చిల్లర పబ్లిసిటీ కోసం ఈ విధంగా చేయడం సరైనది కాదు. నేను ఈ కథను రాసి డైరెక్ట్ చేశాను. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడండి. దిల్ రాజు వంటి పెద్ద వ్యక్తిని అభాసు పాలు చేయొద్దు. ఆయన బొమ్మ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని చిల్లర వ్యక్తులు చేసే డ్రామా ఇది. నేను ‘పచ్చికి’ కథ చదివాను. ఆయన కథలో పర్యావరణం అనే పాయింట్‌ను టచ్ చేశారు. దానికి దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. తరతరాలుగా వస్తున్న అంశాలపై ఎవరైనా సినిమాలు చేయవచ్చు. కానీ, చిల్లరగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరూ చెప్పని పాయింట్‌ను కథగా రాస్తే అదే మూల కథ అవుతుంది. కాకి అనేది తెలుగువారి సంస్కృతిలో భాగమే. అటువంటి పాయింట్‌పై కథ రాసి మూల కథ అంటే ఎలా కుదురుతుంది. ఆ పాయింట్‌తో ఎవరైనా సినిమాలు చేయవచ్చు’’ అని వేణు పేర్కొన్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికంటే..?
Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు
Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్