సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bedurulanka 2012: కవ్వించే కన్నెపిల్ల... క్షణంలో అగ్గిపుల్ల.. రొమాంటిక్‌గా ‘వెన్నెల్లో ఆడపిల్ల’

ABN, First Publish Date - 2023-03-07T13:33:40+05:30

కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (Ravindra Benerjee) (బెన్నీ) ముప్పానేని

Neha Shetty and Kartikeya Gummakonda
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (Ravindra Benerjee) (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ (Clax) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ (DJ Tillu) ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘వెన్నెల్లో ఆడపిల్ల’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘పిల్ల’, ‘పుల్ల’, ‘ఎల్లా’ అంటూ ప్రాసలతో సాగిన ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Vennello Aadapilla Song)

‘వెన్నెల్లో ఆడపిల్ల...

కవ్వించే కన్నెపిల్ల...

కోపంలో చూస్తే ఎల్లా...

క్షణంలో అగ్గిపుల్ల...’ హాయిగా సాగిపోతున్న ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) బాణీ వినసొంపుగా ఉంది. ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్, జెవి సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ (Brinda Master) నృత్య దర్శకత్వం వహించారు. ఈ లిరికల్ వీడియోలో కార్తికేయ, నేహా శెట్టిల కెమిస్ట్రీ చూడ ముచ్చటగా ఉంది. ప్రేమికుల మధ్య రొమాంటిక్ మూమెంట్స్, ఫీలింగ్స్ చక్కగా ఆవిష్కరించారు. (Vennello Aadapilla Song From Bedurulanka 2012)

పాట విడుదల సందర్భంగా నిర్మాత బెన్నీ ముప్పానేని (Benny Muppaneni) మాట్లాడుతూ.. ఈ పాటకు మణిశర్మ‌గారు అద్భుతమైన బాణీ అందించారు. ప్రేమ కథలోని కీలకమైన సందర్భంలో వస్తుందీ పాట. మణిశర్మ‌గారి బాణీకి తోడు కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్ పాటలో హైలైట్ అవుతాయి. ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. గోదావరి (Godavari) తీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ పాటను చిత్రీకరించాం. ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువు మధ్య రాత్రి వేళల్లో తీసిన పాట ఇది. సినిమాలో హీరో హీరోయిన్ల జోడి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సినిమాకి హైలైట్. అలాగే, కామెడీ కూడా! ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. ఎంటర్‌టైనర్ ఆఫ్ థిస్ సీజన్ అని గర్వంగా చెబుతాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

Updated Date - 2023-03-07T13:33:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!