సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Venkatesh 75: నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను.. రమ్మను’

ABN, First Publish Date - 2023-01-25T15:55:44+05:30

విక్టరీ వెంకటేశ్‌ 75వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. గత ఏడాది ‘ఎఫ్‌3’, ‘ఓరి దేవుడా’ చిత్రంలో అతిథిగా మెప్పించిన ఆయన పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి ‘సైందవ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విక్టరీ వెంకటేశ్‌ 75వ (Venkatesh 75) చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. గత ఏడాది ‘ఎఫ్‌3’, ‘ఓరి దేవుడా’ చిత్రంలో అతిథిగా మెప్పించిన ఆయన పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో (action entertainer)ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి ‘సైందవ’ (saindava)అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘హిట్‌’, హిట్‌ 2 చిత్రాలతో విజయం అందుకున్న శైలేష్‌ కొలను (Sailesh kolanu)ఈ సినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి గల గ్లింప్‌లో వెంకటేశ్‌ గన్‌ పట్టుకుని ‘నేనిక్కడే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను.. రమ్మను’ అంటూ హెచ్చరించిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ అలరిస్తోంది.. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రంతో విజయం అందుకున్న నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తారు. వెంకట్‌ బోయినపల్లి ఈ చిత్రానికి నిర్మాత.

Updated Date - 2023-01-25T15:55:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!