VarunLav: ఒక్కటైన వరుణ్ తేజ్, లావణ్య.. సెటబ్రెటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ
ABN, First Publish Date - 2023-11-02T10:32:32+05:30
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నిన్న ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి సందర్భంగా ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వాణిని వరుణ్, కాంచీపురం చీరను లావణ్య త్రిపాఠి ధరించగా, అశ్విన్ మావ్లే , హసన్ ఖాన్ స్టైలింగ్ చేశారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(VarunTej), లావణ్య త్రిపాఠి(Lavanya) వివాహం నిన్న ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి సందర్భంగా ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వాణిని వరుణ్, కాంచీపురం చీరను లావణ్య త్రిపాఠి ధరించగా, అశ్విన్ మావ్లే , హసన్ ఖాన్ స్టైలింగ్ చేశారు.
అతికద్ద మంది మాత్రమే పాల్గొన్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej), అల్లు శిరీష్(Allu Sirish), వైష్ణవ్ తేజ్(VaishnavTej), నితిన్ మరియు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ , లావణ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అక్టోబర్ 30న కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవగా, హల్దీ, మెహందీ వేడుకలు ఇటలీలోనే కుటుంబ స్యుల సమక్షంలో నిర్వహించారు. ఆక్టోబర్ 5న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో రిషెప్షన్ జరుగనుంది.