సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

VarunLavanyaMarriage: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా... పెళ్లి ఎప్పుడు, ఎక్కడ...

ABN, First Publish Date - 2023-05-17T13:00:51+05:30

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం ఎప్పుడో కన్ఫర్మ్ అయిపొయింది. అయితే ముందుగా ఎప్పుడు ఎంగేజ్ మెంట్ చేసుకోవాలి, పెళ్లి ఎక్కడ ఎప్పుడు అనే ఆలోచనలో నాగబాబు కుటుంబం వుంది అని తెలుస్తోంది. ఇంతకీ ఎక్కడంటే..

Lavanya Tripathi and Varun Tej
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుణ్ తేజ్ (VarunTej), లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) ఇద్దరూ మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వున్నారు. వీళ్ళ వివాహం గురించి సాంఘీక మాధ్యమం లో మళ్ళీ వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతకీ వీళ్లిద్దరి వివాహానికి పెద్దలు ఒప్పుకున్నారా, ఎప్పుడు, ఏంటి ఎలా అనే విషయాలు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నారు. #VarunLavanyaMarriage ఇదే విషయాన్నీ వరుణ్ తేజ్ దగ్గర వుండే వాళ్ళని అడిగితే, ఈ వివాహానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, అయితే ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తారు అని చెప్తున్నారు.

"ఈ ఏడాది ఎంగేజ్ మెంట్ ఉంటుంది, వచ్చే సంవత్సరం వివాహం ఉండొచ్చు" అని చెప్పాడు ఒకతను. ఎందుకంటే వరుణ్ తేజ్ ఇప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు, #VarunLavanyaMarriage అందులో ఒకటి పాన్ ఇండియన్ సినిమా కూడా, అంటే ఇతను హిందీలోకి ఆరంగేట్రం చేస్తున్నాడు. అందువలన వచ్చే నెలలో ఎంగేజ్ మెంట్ చేసుకొని, వచ్చే సంవత్సరం వివాహం చేసుకోవచ్చు అని అంటున్నారు.

ఈ ఇద్దరికీ ఎప్పటి నుండో పరిచయం వుంది, అలాగే లావణ్య, వరుణ్ తేజ్ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ అయినా అటెండ్ అవుతూ ఉంటుంది అని తెలిసింది. అందులో భాగంగానే ఆమె నిహారిక పెళ్ళికి వచ్చి కుటుంబ సభ్యుల్లో ఒకరుగా మెలిగింది. అప్పుడే అందరూ అనుకున్నారు, లావణ్య, వరుణ్ ల వివాహం ఖాయం అని. అప్పటి నుండి అందరూ వీళ్లిద్దరి గురించి రాస్తున్నారు కానీ, ఇంతవరకు ఆ ఇద్దరి దగ్గర నుండి కానీ, లేదా కుటుంబాల నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నాగబాబు (KonidelaNagababu) ఏ విషయం అయినా కుండబద్ధలు కొట్టినట్టు మళ్లాడే వారు, కానీ కొడుకు పెళ్లి విషయం ఇంత వైరల్ అవుతున్నా, ఏమీ మాట్లాడకుండా కూర్చోవటం ఆశ్చర్యమే.

ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరి పెళ్లి వార్త వైరల్ అవుతోంది అంటే, ఎదో నడుస్తోంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే మే, జూన్ మాసాలు పెళ్ళిళ్ళకి, మంచి పనులకు మంచి నెలలు. అందుకని ఈ నెలలో కానీ, వచ్చే నెలలో కానీ వరుణ్ తేజ్, లావణ్య ల నుండి మంచి శుభవార్త వచ్చే అవకాశం వుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు (PraveenSattaru) సినిమా షూటింగ్ లో వున్నాడు.

Updated Date - 2023-05-17T13:01:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!